Tirupati Laddu Controversy: పీసీ సర్కార్ కంటే పెద్ద మెజీషియన్ చంద్రబాబు నాయుడు అంటూ ఏపీ ముఖ్యమంత్రిపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వైసీపీ నేతలు పూజలు చేస్తున్నారు.. ఇక, ఈ సందర్భంగా విశాఖలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్.. తప్పులు ఎవరు చేస్తారో వాళ్లే ప్రాయశ్చితం చేసుకోవాలి.. పవన్ కల్యాణ్ దీక్షలు చూస్తే అదే అనిపిస్తోందన్నారు.. పాపాలు చేసింది, హిందువుల మనోభావాలతో ఆటలు ఆడింది, రాజకీయం చేస్తున్న వాళ్లకు మేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.. అయితే, సమయం వచ్చినప్పుడు నిజాలు అన్నీ బహిర్గతం అవుతాయన్నారు.. సిట్ ఎంక్వైరీ అంటే చంద్రబాబు సీటు కింద పెట్టుకోవడం తప్ప బహిర్గతం కాదన్నారు.. ప్రభుత్వంలో ఉద్యోగులు చేసే విచారణపై మాకు, ప్రజలకు నమ్మకం లేదు.. స్వతంత్ర సంస్థ అయిన సీబీఐ తో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.. పాదయాత్రలో మెట్ల మార్గం ద్వారా తిరుమల వెళ్లినప్పుడు అవసరం లేని డిక్లరేషన్.. ఇప్పుడు ఎందుకు అవసరం..? అని ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్..
Tirupati Laddu Controversy: సీబీఐ విచారణ చేయాలి
- పీసీ సర్కార్ కంటే పెద్ద మెజీషియన్ చంద్రబాబు..
- తిరుమల లడ్డూ వివాదంలో సీబీఐతో విచారణ జరిపించాలి..
- సిట్ విచారణపై మాకు నమ్మకంలేదన్న గుడివాడ అమర్నాథ్..
Show comments