NTV Telugu Site icon

నోట్లో డీజిల్ పోసుకున్న వ్యక్తి.. అంతలోనే అంటుకున్న మంటలు

విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో నాగుల చవితి సందర్భంగా నిర్వహించిన నేల వేషాల కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. సంతోష్ అనే వ్యక్తి నోట్లో డీజిల్ పోసుకుని విన్యాసాలు చేస్తుండగా.. మంటలు అంటుకుని అతడి ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా.. అప్పటికే సంతోష్ చేతిలోని సీసాలో ఉన్న డీజిల్ పడి మంటలు మరింత తీవ్రమయ్యాయి.

Read Also: బట్టల షాపులోకి దూసుకెళ్లిన పల్సర్ బైక్.. ఎగిరిపడ్డ యువకుడు

ఈ ఘటనలో సంతోష్ ముఖం, ఛాతి భాగాలకు తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే అతడిని స్థానికులు విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సంతోష్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరగడంతో స్థానికులు ఏమవుతుందోనని ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.