NTV Telugu Site icon

Vizag: విశాఖ సెంట్రల్ జైలు వద్ద వార్డర్స్ నిరసన.. డీఐజీ సీరియస్

Vizag Cental Jail

Vizag Cental Jail

విశాఖ సెంట్రల్ జైల్ దగ్గర కానిస్టేబుల్స్ సిబ్బంది నిరసనపై డీఐజీ రవి కిరణ్ సీరియస్ అయ్యారు. డ్యూటీకి రావొద్దని.. మీకు దిక్కున్న చోట చెప్పుకోండని హుకుం జారీ చేశారు. 40 మంది కానిస్టేబుళ్లపై చర్యలకు ఆదేశించారు. ఈ క్రమంలో హోంమంత్రిని కలవాలని కానిస్టేబుళ్లు నిర్ణయించుకున్నారు.

Read Also: Manohar Rao: సోనియా గాంధీ కనీసం అంత్యక్రియలకు హాజరు కాలేదు: పీవీ నరసింహారావు సోదరుడు

మరోవైపు.. విశాఖ సెంట్రల్ జైల్ వార్డర్స్ ఆందోళన ఎపిసోడ్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి.. అనుకూలంగా ఉన్నామనే తమపై కక్షపూరితంగా డీఐజీ రవికిరణ్ రెడ్డి, సూపరెండెంట్ మహేష్ బాబు వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో.. వార్డర్స్ ఎన్టీవీతో ఫోన్‌లో మాట్లాడి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. కూటమి నేతలు తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

Read Also: New Year Celebrations: బెజవాడలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు..

మీడియాతో డీఐజీ రవి కిరణ్ చిట్ చాట్ నిర్వహించారు. ఆందోళన చేపట్టిన వార్డర్స్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 37 మందిని ఇక్కడ నుండి బదిలీ చేస్తున్నాం.. వార్డర్స్ ను పద్ధతి ప్రకారమే తనిఖీలు చేశామని తెలిపారు. ఖైదీలా ముందు బట్టలు విప్పి తనిఖీలు చేయలేదని పేర్కొన్నారు. వార్డర్స్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. జయ కృష్ణ, ఎస్వీ నాయుడు అనే ఇద్దరి వద్ద గంజాయి, మొబైల్స్ ఉన్నాయా అని తనిఖీలు చేసామన్నారు. వాసుదేవరావు అనే వార్డర్ ను సస్పెండ్ చేస్తున్నామని డీఐజీ పేర్కొన్నారు.

Show comments