NTV Telugu Site icon

Simhadri Appanna : సింహాచలం చందనోత్సవంలో భక్తుల ఆందోళన

Simhachalam

Simhachalam

సింహాచలం చందనోత్సవంలో భక్తుల అందోళనకు దిగారు. వీవీఐపీ టిక్కెట్లు కొనుగోలు చేసిన గంటల తరబడి క్యూ లైనల్లో ఉండిపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. EO డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు. టైం స్లాట్ విధానం ఫెయిల్ అయిందని అప్పన్న స్వామి భక్తులు మండిపడుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం ఘోర వైఫల్యం చెందిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భక్తులు బారిగేడ్లు విరగ్గొట్టారు. సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి వెళ్తున్న మంత్రి కొట్టు సత్యన్నారాయణకు భక్తుల నుంచి నిరసన సెగ ఎదురైంది. కనీస ఏర్పాట్లు కూడా చెయ్యలేకపోయారని మండిపడుతున్నారు. క్యూ లైనల్లోనే భక్తులు నిరసనను కొనసాగిస్తున్నారు.

Also Read : Virupaksha: ‘కాంతార’ రేంజులో రిలీజ్ చెయ్యాల్సిందే…

భక్తులు నిరసన వ్యక్తం చేయడంతో మంత్రి కొట్టు సత్యనారాయణ పోలీస్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్సవం మొత్తం పాడు చేశారంటూ సీరియస్ అయ్యారు. మరోవైపు సింహాచలం చందనోత్సవం నిర్వహణపై విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ఘోరమైన ఏర్పాట్లు ఎప్పుడు చూడలేదు అంటూ వ్యాఖ్యానించారు. ఆలయంలో పోలీసులు జులుం ఎక్కువైంది అని ఆయన అన్నారు. గర్భాలయంలో ఆచారాలు మంటగలిపి ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు.. ఈరోజు దర్శనానికి ఎందుకు వచ్చానా అనే బాధ కలుగుతుంది అని విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. పేదల దేవుడి దగ్గర గందరగోళం సృష్టించారు.. ఇన్ చార్జ్ ఈఓతో ఉత్సవాలు చేస్తారా అంటూ విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : AP Weather : ప్రజలకు హెచ్చరిక.. ఆ జిల్లాలో పిడుగులు పడే ఛాన్స్

ఇక ఇదే విషయంపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాస్ రావు స్పందించారు. చందనోత్సవం నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం వల్లే ఘోరంగా విఫలమైంది అని అన్నారు. ఆలయంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోయారని మండిపడ్డారు. తన భక్తులను సింహాద్రి అప్పన్న కాపాడుకోవాలిసిన పరిస్థితిని తెచ్చారని గంటా శ్రీనివాస్ రావు అన్నారు. భక్తులకు తీవ్ర అసౌకర్యం కలగడంతో దేవస్థానం కమిటీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. అంతరాలయ దర్శనాన్ని పూర్తిగా రద్దు చేసింది. నీలాద్రి గుమ్మం నుంచే దర్శనాలు జరిగేలా చర్యలు తీసుకుంది. అంతరాలయం దర్శనం రద్దుపై ప్రత్యేక టిక్కెట్లు పొందిన వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1500రూపాయలు టిక్కెట్ కొనుగోలు చేస్తే సాధారణ దర్శనం కల్పించడం పై భక్తులు మండిపడుతున్నారు. ఉత్సవ కమిటీ-దేవస్థాన కమిటీ మధ్య వివాదం వల్లే ఈ వైఫల్యం తలెత్తిందని భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు.

Show comments