సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. ఈ మేరకు పవన్‌కల్యాణ్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. సింహాచలంలో గోడ కూలి క్యూలైన్‌లో ఉన్న భక్తులు మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. భారీ వర్షాలు కారణంగా గోడ కూలిందని అధికారులు చెప్పినట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు పవన్‌కల్యాణ్ సూచించారు.
ఇక క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీతో విచారణకు సీఎం ఆదేశించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.25లక్షల చొప్పున సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.3లక్షల పరిహారం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. అంతేకాకుండా బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Chandrababu: సింహాచలం ఘటనపై చంద్రబాబు విచారం.. మంత్రులతో సీఎం టెలీకాన్ఫరెన్స్
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే భారీ వర్షం కారణంగా గోడ కూలడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Cyber Fraud : క్వికర్ క్విజ్.. నమ్మితే నిండా మునిగినట్టే.. లక్షన్నర కాజేసిన సైబర్ కేటుగాళ్లు..!
