NTV Telugu Site icon

Deep Technology Summit-2024: నేడు డీప్ టెక్ సమ్మిట్-2024.. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు

Babu

Babu

Deep Technology Summit-2024: మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖ మరో కీలక సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. గ్లోబల్‌ ఫోరం సస్టెయినబుల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ GFST  ఆధ్వర్యంలో  “డీప్‌ టెక్‌ సమ్మిట్‌-2024″కు వేదికైంది. ఇక, ఈ కీలక సమ్మిట్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. ఈ సదస్సులోనే వచ్చే ఐదేళ్ల కాలానికి రోడ్ మ్యాప్ రూపొందించే అవకాశం వుంది. హెల్త్‌ రంగం, ఎంఎస్‌ఎం ఇల గ్రోత్‌కి ఈ సమ్మిట్‌ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. 2047 నాటికి రాష్ట్రం అన్ని రంగాల్లో గ్రోత్‌ జాబ్స్‌ సాధన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా డీప్‌ టెక్‌ సమ్మిట్‌-2024 కీలకంగా మారింది.

Read Also: Maharashtra: ఈ వారం నుంచే అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్ ఎన్నిక ఎప్పుడంటే..!

భారతదేశం గ్లోబల్‌ డీప్‌ టెక్నాలజీ ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీలకు హబ్‌గా మారుతున్న తరుణంలో  డీప్‌టెక్‌ రివల్యూషన్‌ తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు రోజువారీ పనుల్లో వినియోగించే టెక్నాలజీకి ఆవిష్కరణలను తోడు చేయడమే ‘డీప్‌ టెక్‌ సమ్మిట్‌’ ఉద్దేశం. పౌర సేవలు, పాలనలో పారదర్శకత వంటి విషయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి.. ఐటీ రంగంలో అభివృద్ధిపై ఒక ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం వుంది. ఐటీ రంగంలో ఇన్నోవేషన్స్‌, పాలసీ మేకర్‌లు, ఇండస్ట్రీ లీడర్లు ఈ సమ్మిట్ కు హాజరవుతున్నారు. సీఎం షెడ్యుల్ లో ఎక్కువ సమయం డీప్‌టెక్‌ సదస్సు జరుగుతున్న ప్రాంగణంలోనే వుండే విధంగా ఫిక్స్ అయ్యింది. ఈ పర్యటనలో భాగంగా VMRDA అభివృద్ది పనులుపై సమీక్ష, NTR భవన్ లో ముఖ్య నాయకత్వంతో సమావేశం వంటివి వున్నప్పటికీ డీప్ టెక్ సమ్మిట్ సమయం మీద ఆధారపడి మిగిలిన కార్యక్రమాల్లో కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Show comments