CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో సీఐఐ ప్రతినిధులతో వర్చువల్ గా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వనరులు, అవకాశాల గురించి వివరిస్తూ సీఐఐ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అందుకు ప్రభుత్వం తరపున అవసరమైన సాయం చేస్తామని వెల్లడించారు. రాష్ట్రాన్ని పునర్నించే క్రమంలో పరిశ్రమలకు మెరుగైన రాయితీలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పేదరికం లేని సమాజ స్థాపనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సంస్కరణలు రాజకీయంగా నష్టం చేకూర్చినా ప్రజలకు మంచి చేస్తాయని కొన్ని ఘటనలను కూలంకషంగా సీఐఐ ప్రతినిధులకు వివరించారు ఏపీ సీఎం.. 1995లో తొలిసారిగా నేను ముఖ్యమంత్రి అయినప్పుడు సీఐఐ చిన్న సంస్థగా ఉండేది. ఇప్పుడు అదే సీఐఐ పెద్ద సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగలిగే సంస్థ. అప్పట్లో ప్రతి ఏడాది సీఐఐ కాన్ఫరెన్స్ నిర్వహించేవాళ్లం. అప్పుడు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితిలో షెడ్డుల్లో, హోటల్ లో కాన్ఫరెన్స్ నిర్వహించుకునే దుస్థితి. ప్రస్తుత పరిస్థితి చూస్తే సేవా రంగం, పబ్లిక్ గవర్నెన్స్, ప్రైవేట్ గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ తో సహా ప్రతి రంగంలో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు రాణిస్తున్నారని.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ భారతీయులను నమ్ముతారు. ఇదొక శుభ పరిణామం. మన భారతీయులు సైతం ఏ ప్రాంతం వారితోనైనా, ఏ ప్రాంతంతో అయినా ఇమడగలరు. అది మనకున్న అదనపు వనరుగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వెల్త్ క్రియేషన్, సేవా రంగంలో భారతీయులు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో ఇండియా నెంబర్ 1 లేదా నెంబర్ 2 స్థానంలో ఉండనుందన్నారు సీఎం చంద్రబాబు..
Read Also: Ford Capri EV: సరికొత్త లుక్ లో ఫోర్డ్ కాప్రీ ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 627 కి.మీ
విద్యుత్ సంస్కరణలకు కేరాఫ్ అడ్రస్ ఏపీ
విద్యుత్ సంస్కరణలకు కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ గా అభివర్ణించారు సీఎం చంద్రబాబు.. 1998లోనే తొలిసారి విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్. ప్రధానంగా ట్రాన్స్ మిషన్, జనరేషన్, సంస్థలకు పంపిణీ. దేశంలోనే తొలిసారిగా రెగ్యులేటరీ కమిషన్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశే. ఓపెన్ స్కై పాలసీ ద్వారా హైదరాబాద్ నుంచి దుబాయ్ కి ఫస్ట్ ఎమిరేట్ ఫ్లైట్ తీసుకొచ్చాం. అదే సమయంలో తొలిసారి హైదరాబాద్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి నాంది పలికాం. ఆ తర్వాతే బెంగుళూరు, ముంబయి మొదలైనవి చేపట్టాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ప్రైవేట్ సంస్థల రూపంలో జీవీకే సంస్థ వచ్చింది. ఆ సమయంలో టెలికమ్యూనికేషన్ రంగంలో కేవలం విఎస్ఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ ఉండేవి అని గుర్తుచేసుకున్నారు.
Read Also: Gujarat: ఉద్యోగమో.. రామచంద్రా! హోటల్ ఉద్యోగానికి ఎగబడ్డ నిరుద్యోగులు
పబ్లిక్ పాలసీలను నేను బలంగా విశ్వసిస్తా..
పబ్లిక్ పాలసీలను నేను బలంగా విశ్వసిస్తాను.. ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సంక్షేమం అనేది పేదరికాన్ని పారద్రోలే విధంగా ఉండా.. ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి అన్నారు సీఎం చంద్రబాబు… పేదరికం పోగొట్టేందుకు మనం ఏదైనా చేద్దాం. ఆర్థిక సంస్కరణల తర్వాత ఈరోజు మీ సమక్షంలో పబ్లిక్, ప్రైవేట్ పీపుల్స్ పార్ట్ నర్ షిప్ (పీ4) పాలసీని ప్రవేశపెట్టబోతున్నాను. అందరూ బాగా పని చేస్తున్నారు. షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ ప్రణాళికలున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తే బాగుంటుందో మీరు చెప్పాలి. మీరు మాకు మార్గదర్శకత్వం అందించండి. అవకాశాలు సృష్టించుకొని ముందుకెళ్దాం. పేదరికం లేని దేశాన్ని ఎలా నిర్మించాలనే దాని గురించి ఆలోచిద్దాం. జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్, జీరో పావర్టీ లోకాలిటీ మన లక్ష్యం కావాలని పేర్కొన్నారు.
Read Also: Budget 2024: ఆర్థిక వేత్తలు, నీతి అయోగ్ అధికారులతో ప్రధాని మోడీ భేటీ
సీఐఐ సభ్యుల ప్రశ్నలు.. చంద్రబాబు సమాధానాలు..
వ్యవసాయ రంగం అనేది చాలా ముఖ్యమైన అంశం. అధిక శాతం ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు సీఎం చంద్రబాబు.. అధునాతన వ్యవసాయ పద్ధతులను, డ్రోన్ సాంకేతికతను వినియోగించుకొని పూర్తిస్థాయిలో ప్రగతిని సాధించలేకపోతున్నారు. ఈ అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆక్వా కల్చర్, హార్టికల్చర్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ కి మంచి పేరుంది. ఫార్మా ప్రొడక్షన్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలతో వీటిని అనుసంధానం చేయాలి. వీటి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. సులభతర వ్యవసాయం అనేది నా విధానం. ఇతర పరిశ్రమలు, రంగాలతో పోలిస్తే వ్యవసాయ రంగం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటోంది. నా దృష్టంతా వ్యవసాయ రంగం అభివృద్ధి పైనే. మీకు ఆసక్తి ఉంటే కలిసి పనిచేద్దాం. ప్రగతి సాధిద్దాం. మేం స్కిల్ గణన, ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టాం. రాష్ట్ర యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. తద్వారా వారు ఆర్థికంగా స్థిరపడే అవకాశాలను కల్పిస్తాం. అందుకోసం రాష్ట్రంలో స్కిల్ గణన చేపట్టాం అన్నారు.
Read Also: థాయిలాండ్ రిసార్ట్‌లో సైలెంటుగా పెళ్లి చేసుకున్న వరలక్ష్మి – నికోలాయ్.. ఫొటోలు చూశారా?
ఇక, రాష్ట్రంలో విశాలమైన సముద్ర తీరం ఉంది. సమర్థవంతమైన మౌలిక సదుపాయాలు, అవసరమైన మానవ వనరులున్నాయి అని గుర్తుచేశారు చంద్రబాబు… మా రాష్ట్రంలో ఆటోమొబైల్, హార్డ్ వేర్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మా, అగ్రోప్రాసెసింగ్, తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ సిటిలో మంచి అవకాశాలున్నాయి. రాష్ట్రానికి దగ్గర్లో బెంగుళూరు ఎయిర్ పోర్ట్ ఉంది. గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ అమలు చేసే ఆలోచన ఉంది. రాబోయే 4,5 నెలల్లో సోలార్, విండ్ , పంప్డ్ ఎనర్జీ అమలు చేసే తొలి కార్యక్రమం చేపట్టబోతున్నాం. మా రాష్ట్ర సామర్థ్యాలు పరిశీలించి పారిశ్రామికవేత్తలు మంచి ఆలోచనలతో వస్తే కలిసి పనిచేద్దాం. మీరు ఆలోచనలతో వస్తే మేం అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అన్నారు.. గతంలో మేం విశాఖపట్నాన్ని ఫిన్ టెక్ హబ్ గా తీర్చిదిద్దాం. లండన్, సింగపూర్ ను మోడల్ గా తీసుకొని విశాఖను ఫిన్ టెక్ హబ్ గా మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతాం న్నారు.. 9 ఏళ్ల కాలంలో హైదరాబాద్ లో అత్యుత్తమ ఎకో సిస్టంను రూపొందించాం. విజయం సాధించాం. ప్రస్తుతం హైదరాబాద్ అనే ప్రాంతం లాజిస్టిక్ హబ్, నాలెడ్జ్ ఎకానమీకి ఒక మోడల్ గా తయారైందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.