BV Raghavulu: ఓ వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం.. మరోవైపు.. జనసేన అవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. విశాఖలోని కుర్మన్నపాలెం దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఆయన.. స్టీల్ ప్లాంట్ కార్మికులకు అన్యాయం చేశారని విమర్శించారు.. వీఆర్ఎస్ పేరుతో కార్మికులను బయటకు పంపుతున్నారు.. కాంట్రాక్టు కార్మికులను తీసేస్తున్నారు.. పోరాటాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్‌ను అమ్మేసి, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌కు అనుమతిస్తున్నారని మండిపడ్డారు.. ప్యాకేజీ వలన స్టీల్ ప్లాంట్ అభివృద్ది జరగదన్న ఆయన.. స్టీల్ ప్లాంట్ కు సొంతగనులు, సెయిల్ విలీనం చేస్తేనే స్టీల్ ప్లాంట్ నిలబడుతుందన్నారు.. ఎన్‌ఎండీసీ నుంచి ఐరన్ ఓర్ తీసుకోవాల్సిన పరిస్థితి… రైల్వే రేకులు కూడా ఇవ్వని పరిస్థితి.. దీనికి ప్రధాన కారణం కేంద్రం స్టీల్ ప్లాంట్ ను అమ్మేయాలనుకోవడమే అని ఆరోపించారు.. స్టీల్ ప్లాంట్ భూములను కోళ్లగొట్టాలని ఆదాని లాంటి వాళ్లు కాపుకాసి వున్నారు.. కార్మికులందరు ఐక్యతగా ఉండాలి, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి… స్టీల్ ప్లాంట్ ను కాపాడు కోవడానికి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలి.. దీనికి రాజకీయ పార్టీలు కూడా నిజాయితీగా సహకరించాలని కోరారు..
Read Also: Asia Record: 24 గంటల్లో 87 లీటర్ల పాలు ఇచ్చిన గోమాత!
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ మోసపూరితం అన్నారు రాఘవులు.. స్టీల్ ప్లాంట్ ను కాపాడడం కోసం కాదు… బ్యాంక్ లు అప్పులు చెల్లించడం కోసమని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ పైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.. 4500 మంది కాంట్రాక్టు ఉద్యోగాలును తొలగించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.. స్టీల్ ప్లాంట్ ను పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిపించాలన్నారు.. అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ పై శ్రద్ధ లేదు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు సొంతంగా గనులు ఇస్తున్నారు, స్టీల్ ప్లాంట్ కు ఎందుకు ఇవ్వరు..? అని నిలదీశారు. కూటమి ప్రభుత్వంపై కార్మికులు అప్రమత్తంగా ఉండాలి. టీడీపీ, జనసేన ప్రతిపక్షంలో లేవు అధికార పక్షంలో ఉన్నాయని సూచించారు బీవీ రాఘవులు..
Read Also: CM Chandrababu: ఏ ఊరికి వస్తానో చెప్పను.. క్లీన్‌గా లేకపోతే అంతే..! సీఎం స్వీట్ వార్నింగ్..
ఇక, పవన్ కల్యాణ్ ప్రసంగం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు సీపీఎం రాఘవులు.. చేగువేరా డాక్టర్ అని చెప్పారు.. అందుకే ఆయనను ఇష్టమని పవన్ చెప్పారు.. చేగువేరా ఎప్పుడు వైద్యం చేశారో మాకు తెలియదన్నారు.. చేగువేరా గొప్ప వ్యక్తి.. ప్రపంచం మెచ్చిన వ్యక్తి.. గతంలో చేగువేరా పేరు చెప్పి పవన్ కల్యాణ్ ఓట్లు వేయించుకున్నారు.. ఇప్పుడూ చేగువేరా డాక్టర్ అని చెబుతున్నారని దుయ్యబట్టారు..