NTV Telugu Site icon

Vizag Honey Trap Case: సంచలనం సృష్టించిన విశాఖ హనీట్రాప్ కేసు.. వెలుగులోకి మరో ట్విస్ట్..!

Vizag Cp

Vizag Cp

Vizag Honey Trap Case: విశాఖ జిల్లాలో సంచలనం సృష్టించిన హానీ ట్రాప్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తీసుకుంటోంది. ఇప్పటికే హానీ ట్రాప్ లో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసును విచారిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ హర్షకుమార్ కలగజేసుకోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేని అతను ఎందుకు కామెంట్స్ చేసారనేది ప్రశ్న.. ఆ వ్యాఖ్యలతో వివాదం కొత్త మలుపు తిరిగినట్లైంది. దీంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అని అటు పోలీసులు ఇటు రాజకీయ వర్గాల్లో ఆశక్తికర చర్చ సాగుతోంది..

Read Also: Ramana Gogula: వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయా.. కానీ ఈ పాట నేనే పాడాలి అనిపించింది!

విశాఖకు చెందిన జాయ్ జమీనా అనే యువతి ఆన్ లైన్ లో డబ్బున్న వారిని ప్రలోభ పెట్టి అనంతరం వారిని బుట్టలో వేసుకొని చనువుగా మెలిగి వీడియోస్, ఫొటోస్ తో బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు లాగుతోందనే సమాచారంతో పోలీసులు సదరు యువతిని అరెస్టు చేశారు. ఎన్ఆర్ఐ యువకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. లోతుగా విచారణ చేసిన అనంతరం ఈ కేసులో మరి కొందరి ప్రమేయం ఉందని పోలీసులు ఓ ఫారెస్టు అధికారితో పాటు మరొకరిని అరెస్టు చేశారు. మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొంత మంది బాధితులు ఈ కేసులో ముందుకు వస్తున్నట్లుగా ప్రకటించారు. ఐతే ఈ కేసు అంతా కొలిక్కి వచ్చింది అనుకుంటున్న తరుణంలో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ బాంబు పేల్చారు. ఈ కేసులో జాయ్ జమీమాకు ఎటువంటి సంబంధం లేదని.. ఆమెకు వ్యతిరేకంగా పోలీసులు ఎటువంటి కచ్చితమైన సాక్ష్యా ధారాలను చూపలేదని ఆరోపించారు. కేవలం చిన్న చిన్న అంశాలను పరిగణలోకి తీసుకుని ఆమెను అరెస్టు చేశారని ఆమె అమాయకురాలని మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు. దీంతో నగర వాసులతో పాటు పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు..

Read Also: Pushpa 2: హిందీలో తగ్గేదేలే.. మరో రికార్డుకు చేరువలో పుష్ప రాజ్

ఇక, ఇదే విషయాన్ని సీపీ దృష్టికి తీసుకువెళ్లగా ఈ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతోందని చెబుతూనే హర్షకుమార్ కుమారుడికి జాయ్ జమీమాకు ఉన్న పరిచయాలు పై విచారణ జరుగుతోందని.. హనీ ట్రాప్ కేసులో హర్ష కుమార్ వ్యాఖ్యలపై కూడా దర్యాప్తు చేస్తామని.. ఈ కేసులో ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఎందుకో అర్ధం కావడం లేదని సీపీ వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానమే అని హనీ ట్రాప్ వ్యవహారంలో ఇప్పటి వరకూ నాలుగు కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. 10 మందికి పైగా బాధితులు ఉన్నారని ప్రధాన నిందితులైన జాయ్ జమీమా, వేణురెడ్డి, కిషోర్ లను అరెస్ట్ చేశామని మరో ముగ్గురిని త్వరలో అరెస్టు చేస్తామని వెల్లడించారు. బీజేపీకి సంబంధించిన ఒక చోటా నేత ఈ వ్యవహారంలో ఉన్నట్లు ప్రచారం జరిగిందని.. ఐతే అతనికి బీజేపీతో సంబంధం లేదని తమ విచారణలో తేలినట్లు కమీషనర్ వెల్లడించారు. దీంతో ఈ కేసు మరెన్ని మలుపులు తిరిగుతుందోననే ఆశక్తి విశాఖ వాసుల్లో నెలకొంది. అయితే, హనీ ట్రాప్ వ్యవహారంలో ప్రధాన నిందితులను అరెస్టు చేసినప్పటికీ.. ఈ కేసులో విచారించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని సీపీ మాటల ద్వారా అర్ధమవుతోంది. దీంతో ఈ కేసు మరెన్ని మలుపులు తిరిగుతుందోననే ఆశక్తి నెలకొంది.

Show comments