Site icon NTV Telugu

Visakhapatnam: విశాఖలో మేయర్పై అవిశ్వాస తీర్మానం నోటీసుల్లో కొత్త ట్విస్ట్!

Gvmc

Gvmc

Visakhapatnam: విశాఖపట్నంలో మేయర్ పై అవిశ్వాసం తీర్మానం నోటీసుల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. GVMC ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కోసం పంపిన అజెండా చూసి కార్పొరేటర్లు అవాక్కయ్యారు. అవిశ్వాసంపై ఓటింగ్ కోసం కాకుండా “తీర్మానం” కోసం సమావేశం పెట్టామని సమాచారం.. దీంతో మేయర్ పై GVMC అవిశ్వాసం అంటూ నోటీసులు ఇవ్వడంపై వైసీపీ కార్పొరేటర్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషనర్ పేరుతో అందిన లేఖలు అనుమానాలు రేకెత్తించేవిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, 58 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులపై సంతకాలు పెట్టారని.. వాటిని జత చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. తనకు అందిన అజెండాలో సభ్యులు సంతకాలతో కూడిన కాపీ ఇవ్వలేదంటున్నారు కార్పొరేటర్లు.

Exit mobile version