Ayodhya Ram Mandir Scam: విశాఖపట్నంలో అయోధ్య రామ్ నమూనా మందిరం వివాదం కేసులో బిగ్ ట్విస్ట్. ఒక్కోక్కటిగా నిర్వాహకుల అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. దేవుడి పేరుతో వ్యాపారమే లక్ష్యంగా నిర్వాహకుడు దుర్గా ప్రసాద్ రెచ్చిపోయాడు. దేవుడి పేరుతో బిజినెస్ చేసేందుకు అమాయకులకు ఎరా వేసినట్లు గుర్తించారు. పెట్టుబడి పెడితే రెట్టింపు ఆదాయం వస్తుందని మోసాలకు పాల్పడుతున్న నిర్వాహకుడు. ఒక్కొక్కరిగా బాధితులు బయటకు వస్తున్నారు. నిర్వాహకుడు వంగలపూడి దుర్గాప్రసాద్ తనను ఏ విధంగా మోసం చేశాడో సెల్ఫీ వీడియా ద్వారా తెలిపిన కాకినాడకు చెందిన బుద్ధ గణేష్ అనే యువకుడు. అయోధ్య రామ్ నమూనా సెట్ లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు ఇస్తానని దుర్గా ప్రసాద్ నమ్మబలికాడు అని చెప్పుకొచ్చాడు. అయితే, బుద్ధ గణేష్ దగ్గర నుంచి దుర్గా ప్రసాద్ రూ. 32 లక్షలు ఖర్చు పెట్టించారు. కాకినాడ జిల్లా ఎస్పీ ఆఫీస్ లో గ్రీవెన్స్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.
Read Also: Investopia Global-AP: నేడు విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్-ఏపీ సదస్సు.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు
మరోవైపు, గరుడ అయోధ్య రామ మందిరం సెట్ వివాదంలో దేవుడి పేరుతో వ్యాపారం చేయడంపై ధార్మిక, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేడు నమూనా దేవాలయం దగ్గరకు సాధువులు, హిందూ సంఘాల ప్రతినిధులు వెళ్లనున్నారు. భారీగా వసూళ్లకు కారణమైన సెట్ ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం అర్చకుల సమక్షంలో కళ్యాణం ప్రకటనతో నిర్వహకుల బండారం బయటపడింది. నిర్వాహకులపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. భక్తులు ఫిర్యాదు చేస్తే విచారించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
