Army Recruitment Rally: నేటి నుంచి అగ్నివీర్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం పోర్టు స్టేడియంలో భారీ ఆర్మీ ర్యాలీలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ వరకూ జరిగే ఈ నియామక ప్రక్రియలో వివిధ రకాల పరీక్షలు పెట్టే అవకాశం ఉంది. పదో తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులతో పాటు 8వ తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ ట్రేడ్ మ్యాన్ పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. పోర్టు స్టేడియానికి ఆదివారం అర్ధరాత్రి నుంచి అభ్యర్థులు భారీగా చేరుకుంటున్నారు.
Read Also: Amy Jackson Wedding: ఘనంగా హీరోయిన్ అమీ జాక్సన్ పెళ్లి.. వెడ్డింగ్ పిక్స్ వైరల్!
ఇక, ముందుగా రిజిస్టర్ చేసుకొని అడ్మిట్ కార్డులు తీసుకున్న వారికి మాత్రమే నియామక ప్రక్రియలో పాల్గొనేందుకు ఛాన్స్ కల్పించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, కాకినాడ, ఏలూరు, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన యువకులు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. అడ్మిట్ కార్డుల కోసం ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన ప్రతి ఒక్క ధృవపత్రంతో అభ్యర్థులు హాజరవ్వాలని అధికారులు సూచించారు.
Read Also: China landslides Floods: చైనాలో భారీ వర్షాలు… నార్త్ వెస్ట్రన్ ప్రావిన్స్‌లో వరద విధ్వంసం
కాగా, పూర్తి పారదర్శకంగా అగ్నివీర్ నియామక ప్రక్రియ జరుగుతుందనీ.. దళారుల్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని రక్షణ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. ఆర్మీ ర్యాలీకి సంబంధించి పోర్టు స్టేడియంలో అభ్యర్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కలెక్టర్ హరేందీర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చీ పర్యవేక్షించారు. ప్రతి రోజూ 500 నుంచి 800 మంది యువకులు ఈ ర్యాలీలో పాల్గొనే ఛాన్స్ ఉందని అధికారులు పేర్కొన్నారు.
