Site icon NTV Telugu

Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రజల నుంచి సూచనలు

Rishikonda

Rishikonda

Rushikonda Buildings: విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన భవనాల వినియోగంపై ప్రజల సూచనలు స్వీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ (ఏపీటీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. 9 ఎకరాల విస్తీర్ణంలో ఆధునీకరించిన ఈ భవనాలను ఏ విధంగా వినియోగించాలనే అంశంపై బహిరంగ ప్రకటన రిలీజ్ చేసింది. ప్రజలు తమ అభిప్రాయాలు, సలహాలను ఏపీటీఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. రుషికొండ భవనాల వినియోగం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని ఎన్డీయే కూటమి ప్రభుత్వం భావిస్తోంది.

Read Also: Yellamma : ‘ఎల్లమ్మ’ నుండి నితిన్ అవుట్.. మరో యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్

అయితే, రుషికొండ భవనాలపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండు రోజుల క్రితం సమావేశమైంది. ఈ సందర్భంగా భవనాల వినియోగానికి సంబంధించిన పలు అంశాలను సమీక్షించింది. అనంతరం ఈ కమిటీ నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Exit mobile version