Site icon NTV Telugu

Betting Apps: బెట్టింగ్‌ యాప్స్‌కు మరో యువకుడి బలి.. అప్పులు చేసి మరీ బెట్టింగ్.. చివరకు..!

Crime

Crime

Betting Apps: బెట్టింగ్‌ యాప్‌లు ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి.. బెట్టింగ్‌ యాప్‌లలో డబ్బులు పెట్టి సంపాదిస్తామన్న ఆశతో వాటి మోజులో పడి.. ఉన్న డబ్బునంతా పోగొట్టుకోవడమే కాదు.. అప్పులు చేసి మరి బెట్టింగ్‌లు పెట్టి.. చివరకు లక్షల్లో అప్పులు కావడం.. తీర్చే స్తోమత కూడా లేకుపోవడంతో.. ప్రాణాలు తీసుకుంటున్నారు ఎంతో మంది యువకులు.. తాజాగా, బెట్టింగ్ యాప్ లకు విశాఖపట్నంలో మరో యువకుడు బలి అయ్యాడు..

Read Also: Mangaluru Tension: హత్య కేసులో ప్రధాన నిందితుడు మర్డర్.. పోలీసుల హై అలర్ట్

ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా లాడ్జిలో పనిచేస్తున్న పవన్ అనే యువకుడు.. బెట్టింగ్ కి బానిసగా మారిపోయాడు.. బెట్టింగ్‌తో డబ్బులు సంపాదించవచ్చు అనే ఆశతో.. ఉన్న డబ్బులు పెట్టడమే కాదు.. తన దగ్గర సొమ్ము అంతా అయిపోయిన తర్వాత.. అనేక చోట్ల అప్పులు చేసి మరీ బెట్టింగ్ వేశాడు.. అప్పులు ఇచ్చినవారి నుంచి ఒత్తిళ్లు ఓవైపు.. బెట్టింగ్‌లో డబ్బులు అన్నీ పోవడం మరోవైపు.. తీవ్రమనస్తాపానికి గురైన పవన్‌.. చివరకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు.. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.. అయితే, బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అప్పులు పాలైన యువకుడు.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.. బెట్టింగ్‌ యాప్స్‌ జోలికి పోవద్దు.. మీ జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దు.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని పోలీసులు సూచిస్తున్నారు..

Exit mobile version