Site icon NTV Telugu

Vizag Crime: ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్..

Iphone

Iphone

Vizag Crime: ఐఫోన్‌ అంటే చాలా మందికి పిచ్చి.. ముఖ్యంగా యూత్‌ అయితే.. నచ్చిన ఐఫోన్ తమ చేతిలో ఉండాలని కలలు కంటారు.. ఈ మధ్యే ఐఫోన్ కొత్త మోడల్‌ మార్కెట్‌ లోకి రావడం.. స్టోర్‌ల వద్ద మరీ పడిగాపులు కానీ.. ఆ ఫోన్‌లు సొంతం చేసుకున్నవారు కూడా ఉన్నారు.. అక్కడి వరకు బాగానే ఉంది.. కానీ, ఫోన్‌ కోసం ప్రాణాలు సైతం తీసుకునేంత పిచ్చిమాత్రం ఎవ్వరికీ ఉండకూడదు.. కానీ, ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు.. విశాఖపట్నంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పెందుర్తి సుజాతానగర్ లో నివాసం ఉంటున్న మృతుడు సాయి మారుతి తండ్రి చంద్రశేఖర్ స్టాక్‌ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతూ ఉంటాడు.. అతని కుమారుడు సాయి మారుతి కెవిన్ కొంతకాలం హైదరాబాద్ లో సినిమా పరిశ్రమలో పనిచేసి, ఇటీవలే ఇంటికి వచ్చాడు.

Read Also: New GST: సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. అమల్లోకి జీఎస్టీ 2.o.. వీటి రేట్లు తగ్గాయి..

అయితే, ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి తండ్రి చంద్రశేఖర్ ను ఐఫోన్ కొని ఇవ్వాలని అడిగేవాడు.. ఈ ఫోన్ విషయమై ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.. అనంతరం గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు.. కెవిన్ సాయంత్రమయినా బయటకు రాకపోవడం పై అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తలుపును బలవంతంగా తెరవడంతో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు.. తల్లిదండ్రులు మృతుడు కేవెన్ ను దించగా అప్పటికే మృతిచెందాడు.. సమాచారం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పెందుర్తి పోలీసులు..

Exit mobile version