Site icon NTV Telugu

Srikakulam: వైరల్ వీడియో.. వైసీపీ కార్యకర్తపై చేయి చేసుకున్న మంత్రి ధర్మాన

Minister Dharmana

Minister Dharmana

వైసీపీ కార్యకర్తపై మంత్రి ధర్మాన చేయి చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ధర్మాన ప్రసాదరావు శుక్రవారం నాడు శ్రీకాకుళంలో పర్యటించారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్లీ మంత్రి పదవి చేపట్టిన ధర్మాన ప్రసాదరావును కలిసేందుకు భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మానతో కరచాలనం చేసేందుకు వైసీపీ కార్యకర్తలు పోటీ పడ్డారు. ఈ సమయంలో ఓ వైసీపీ కార్యకర్త మంత్రి ధర్మాన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. దీంతో అసౌకర్యానికి గురైన మంత్రి ధర్మాన వైసీపీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు.

కాగా కులాన్ని, మతాన్ని చూసి ఓట్లు వేసే రోజులు పోయాయని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడమే ఇందుకు నిదర్శనమన్నారు. నీతి, నిజాయితీగా పనిచేస్తేనే ప్రజలు నమ్ముతారని.. రెవెన్యూ శాఖలో అవినీతి పేరుకుపోయిందని.. ఇది మనందరం సిగ్గుపడాల్సిన విషయమని ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు.

Exit mobile version