Site icon NTV Telugu

Auction For Belt Shop: ఆలయంలో బెల్ట్ షాపు కోసం వేలంపాట.. సోషల్ మీడియాలో వైరల్

Auction For Liquor Shop

Auction For Liquor Shop

బాపట్ల జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో బెల్ట్ షాపు నిర్వహణ, నాటుసారా అమ్మకాలకు వేలంపాట నిర్వహించారు. అయితే గ్రామంలోని అధికారులు ఈ వేలంపాట నిర్వహించిన విధానం ఇప్పుడు విమర్శల పాలవుతోంది. గ్రామంలోని ఓ ఆలయంలో వేలంపాట నిర్వహించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. లిక్కర్ షాపు కోసం ఆలయంలో వేలం పాట నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో లిక్కర్ షాపు కోసం వేలం పాట పెట్టి ఓ వర్గాన్ని అవమానపరిచారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ వేలం పాటలో బెల్టు షాపును రూ.7 లక్షలకు ఓ వ్యక్తి దక్కించుకున్నాడు. ఆలయంలో వేలంపాట నిర్వహించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సంబంధిత అధికారులు ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాలి.

Exit mobile version