Site icon NTV Telugu

ఉద్యోగుల ఆందోళనలకు, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధం లేదు: విజయ్‌కుమార్‌

ఉద్యోగుల ఆందోళనలకు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త జిల్లాల ఏర్పాటు పై మాట్లాడారు. లోక్ సభ నియోజకవర్గ పరిధి, భౌగోళిక విస్తీర్ణం, జిల్లా ఆర్థికంగా అభివృద్ధి చెందగలిగే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొత్త జిల్లాల ప్రతిపాదనలు చేశామని చెప్పారు. పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం గత ఏడాదిన్నరగా కొత్త జిల్లాల ఏర్పాటు కోసం కసరత్తు చేసి నిర్ణయం తీసుకుందన్నారు.

Read Also: కొత్త పేస్కేళ్ల ప్రకారమే జీతాలు, పెన్షన్ల బిల్లులు ప్రాసెస్‌ : ఏపీ ఆర్థికశాఖ

ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు కచ్చితంగా అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఓపెన్‌గా ఉందని, ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, సూచనలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తామని విజయ్‌కుమార్‌ చెప్పారు. విజయవాడ విషయంలో కొంత ఇబ్బంది అయిందని పేర్కొన్నారు. మచీలీపట్నంలో పోర్డు ఉండటంతో గన్నవరం లాంటి ప్రాంతాలను కూడా మచీలీపట్నంలోనే కొనసాగించాలనుకున్నామని విజయ్‌కుమార్‌ వెల్లడించారు.

Exit mobile version