Site icon NTV Telugu

Velampalli Srinivas: చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు తెలపండి..

Vellampalli

Vellampalli

Velampalli Srinivasa Rao: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెలంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పశ్చిమాలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో జోగి రమేష్, మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ.. పశ్చిమాలో విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేసిన వైసీపీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గడప దగ్గరకు వచ్చే టీడీపీ నాయకులను ప్రజలు నిలదీయండి.. రాబోయే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమాలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయం.. ప్రజలలో నిరంతరం తిరగాలి.. చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు తెలపండి అని మాజీ మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.

Read Also: Narayanpet Murder Case: భర్తను చంపి సినిమాటిక్‌ డ్రామా క్రియేట్ చేసిన భార్య.. చిన్న క్లూతో..

ఇక, కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా నష్ట పోయారో చెప్పే కార్యక్రమం ఇది మాజీ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. జగనన్న హయాంలో బటన్ నొక్కితే ప్రజలకు డబ్బులు వచ్చేవి ఇప్పుడు అవి లేవు.. జగన్ హయాంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు.. చంద్రబాబు మోసాలు ఒక్కొకటి బయటకు వస్తుంది.. ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు.. సర్వేలలో ప్రభుత్వానికి యాంటీగా ఉంది.. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీ ఓడిపోతుందని టీడీపీ సర్వేలు చెప్తున్నాయి.. చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది.. కార్యకర్త లేనిదే వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు కార్యకర్తలే పార్టీ వెన్నుముఖ అన్నారు. రాబోయే రోజులే కార్యకర్తలే నాయకులు.. వైసీపీ నాయకులు కార్యకర్తలు జనంలోకి వెళ్ళాలని సూచించారు. బాబు వెన్నుపోటు ని ప్రజలకు తెలపాలి.. ప్రతి గడప వద్దకు వెళ్లి జగన్ కి చంద్రబాబు మధ్య తేడాని ప్రజలకు వివరించి.. పశ్చిమ గడ్డ వైకాపా అడ్డగా పార్టీ నాయకులు కార్యకర్తలు కష్ట పడాలని జోగి రమేశ్ వెల్లడించారు.

Exit mobile version