Site icon NTV Telugu

Midhun Reddy: ప్రస్తుతం కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయి

Midhunreddy

Midhunreddy

కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా తనపై మద్యం కేసు పెట్టారని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా శనివారం సిట్ అధికారుల ఎదుట మిథున్‌రెడ్డి హాజరయ్యారు. విచారణ ముగిసిన తర్వాత విజయవాడలో మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy : జపాన్‌లో ఉద్యోగ అవకాశాలకు తెలంగాణ యువతకు వేదిక.. TOMCOM కీలక ఒప్పందాలు

చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ వేధింపులు మొదలయ్యాయని పేర్కొన్నారు. ‘‘మొదట మదనపల్లి ఫైల్స్ తగలబెట్టారన్నారు. తర్వాత మైన్స్‌లో దోచుకున్నారని ఆరోపణలు చేశారు. భూములు ఆక్రమించామన్నారు. ఎర్రచందనం తరలించామని ఆరోపణలు చేశారు.’’ ఆరోపణల్లో ఏవీ కూడా ప్రభుత్వం నిరూపణ చేయలేదని మిథున్‌రెడ్డి తెలిపారు. డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే మద్యం కేసు కూడా తప్పుడిదేనని చెప్పగలనన్నారు. ఈ కేసును ధైర్యంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. న్యాయస్థానం ఈ కేసు గురించి తేల్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ అంశంపై వివరంగా మాట్లాడతానని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉందని.. అందుకే ఈ కేసు గురించి పూర్తిగా మాట్లాడలేకపోతున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: LSG vs RR : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్

Exit mobile version