Site icon NTV Telugu

Fame Turns to Jail: ఇంస్టాగ్రామ్ వీడియోలతో బెజవాడ యువకుల హల్‌చల్- ఇద్దరు అరెస్ట్!

Vja

Vja

Fame Turns to Jail: సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో రెచ్చిపోయిన ఇద్దరు యువకులు కటకటాల పాలయ్యేలా చేసింది. ఇంస్టాగ్రామ్‌లో వీడియోలు చేసేందుకు పోలీస్ స్టేషన్‌నే టార్గెట్ చేసి.. హింసాత్మక డైలాగులతో ఆకట్టుకునే ప్రయత్నం చేయడంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే, విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌పై ఒకటే కోత టూ టౌన్ పీఎస్ కి వార్త అంటూ ఓ వీడియోను చేశారు. అందులో పీకలు కోసి లోపలికి వెళ్తామనే డైలాగుతో హింసను ప్రోత్సహించేలా యాక్ట్ చేసి, సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని పోస్టు చేశారు.

Read Also: Coolie : నాగ్.. తనను తాను యాంటోగనిస్టుగా ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నాడా..?

ఇక, ‘420_బెజవాడక_బాప్’ అనే ఇంస్టాగ్రామ్ ఐడీ ద్వారా యువకులు అనేక హింసాత్మక వీడియోలు అప్‌లోడ్ చేశారు. ఆయా వీడియోల్లో వారు గంజాయి సేవిస్తున్న విజువల్స్, నరికేస్తాం.. చంపేస్తాం లాంటి డైలాగులు చాలా కనిపించాయి. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ఈ వీడియోల ఆధారంగా నిందితుల్లో ఒకరైన గేదెల ఏసుబాబుతో పాటు మరొకరిని పట్టుకుని కొత్తపేట పోలీసులకు అప్పగించారు. టూ టౌన్ పోలీసులు వారిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఈ తరహా వీడియోలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Exit mobile version