NTV Telugu Site icon

NEW YEAR 2025: నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమైన విజయవాడ..

New Year 2025

New Year 2025

నూతన సంవత్సర వేడుకలకు విజయవాడ నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 31 వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల జోష్‌లో ఉన్నారు. 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు విజయవాడ నగర ప్రజలు రెడీ అయ్యారు. ఫుల్ జోష్‌తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు యువత ప్లాన్స్ చేస్తున్నారు.

Delhi: హీటెక్కుతున్న ఢిల్లీ పాలిటిక్స్.. కేజ్రీవాల్ గోల్డ్ టాయిలెట్ అంటూ బీజేపీ నిరసన

విందు వినోదాలతో ఉత్సాహంగా గడిపేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీలో స్టార్ హోటళ్లతో పాటు.. క్లబ్బులు, రిసార్ట్స్‌లో ప్రత్యేకంగా ఈవెంట్లతో ఏర్పాట్లు చేస్తున్నారు. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టే వేళ టాప్ సెలబ్రిటీస్ హై ఓల్టేజ్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ క్రమంలో నగరంలో పలు చోట్ల సింగర్స్, డ్యాన్సర్లతో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. విజయవాడలో నాలుగు చోట్ల భారీ అవుట్ డోర్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, సింగర్స్ గీత మాధురి, మధు ప్రియ, నటి ముమైత్ ఖాన్‌తో పాటు.. మరి కొందరు సినీ సెలబ్రెటీలతో ఈవెంట్స్ ఏర్పాటు చేశారు.

karavali Teaser: భయపెడుతున్న ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ టీజర్

మరోవైపు.. నూతన సంవత్సర వేడుకల క్రమంలో మంగళ, బుధవారం మద్యం విక్రయాలు భారీగా ఉండొచ్చునని మద్యం వ్యాపారులు అంటున్నారు. ఇప్పటికే దుకాణదారులు మద్యం డిపోల నుంచి భారీగా మద్యం నిలవలు కొనుగోలు చేశారు. ఈరోజు, రేపు రాత్రి ఒంటిగంట వరకు ఎక్సైజ్ శాఖ అధికారులు పొడిగించారు. మరోవైపు.. ఏపీలో నూతన సంవత్సరం వేడుకలపై పోలీసులు కఠిన ఆంక్షలను విధించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఈ ఆదేశాలు అమలు చేయనున్నట్లు చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించరాదని పోలీసులు స్పష్టం చేశారు.

Show comments