Anam Ramanarayana Reddy: విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మ వారిని ఎండోమెంట్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితుల ఆశీర్వాదం అందించిన గుడి ఈవో రామారావు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేవాదాయ శాఖకు సంబంధించి సమీక్ష కార్యక్రమం రెండు రోజుల నుంచి దేవదాయ కమిషనర్ పరిధిలో జరుగుతుంది అని తెలిపారు. రాష్టంలో 7 ప్రసిద్ధి ఆలయాలు ఉన్నాయి.. అందులో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం ఒకటి.. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని శివాలయంలో శివుని దర్శనం చేసుకోవడం జరిగింది.. అలాగే, ఆలయ అభివృద్ధి పనులు గురించి ఈవో వివరించారు అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: BJP MLA Died : బీజేపీ ఎమ్మెల్యే శైలారాణి మృతి
ఇక, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది.. అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడే పనే లేదు అని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సూచనతో పాలక మండలి కూడా ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రబాబు సూచనతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం.. ప్రతి భక్తుడికి అమ్మవారి దర్శనం కలగాలని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం.. నిన్న తెలంగాణ నుంచి వచ్చిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు అందరినీ గౌరవించాం అందరికీ వేద పండితుల ఆశీర్వాదం కల్పించి తగిన మర్యాదలు ఇచ్చామని ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.