Site icon NTV Telugu

Vijayawada: అప్పటి నుంచే దేవి నవరాత్రులు ప్రారంభం.. ఏ రోజున ఏ అలంకారంలో దర్శనం ఇవ్వబోతున్నారంటే!

Vijayawada

Vijayawada

Vijayawada: దసరా పండగను అనుసరించి జరగబోయే నవరాత్రులకు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి దేవీ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు ఈ శరన్నవరాత్రులు కొనసాగునున్నాయి. ప్రతి ఏడాది పది అలంకారాలు జరుగుతూ వస్తున్నా.. ఈసారి మాత్రం అమ్మవారు 11 అలంకారాలలో దర్శనం ఇవ్వనున్నట్లు సమాచారం. బాలత్రిపుర సుందరి నుంచి రాజేశ్వరి దేవి వరకు 11 రోజులు 11 అలంకారాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.

ఈ రోజులలో ప్రతి రోజు ప్రత్యేక వస్త్రాలు, ప్రత్యేక నైవేద్యాలు అర్చకులు అమ్మవారికి సమర్పించనున్నారు. నైవేద్యాలలో అమ్మవారికి తీపి బూంది నుంచి చక్కెర పొంగలి వరకు వివిధ నైవేద్యాలను సమర్పించనున్నారు. అలాగే అమ్మవారిని రంగు రంగుల పట్టు చీరలతో సరికొత్తగా ముస్తాబు చేయనున్నారు. ఇక జరగబోయే నవరాత్రుల్లో ఏ రోజు ఏ రూపంలో అమ్మవారు దర్శనమిస్తుందో వివరాలు ఇలా ఉన్నాయి..

Mirai Review : మిరాయ్ రివ్యూ

మొదటి రోజు – బాలా త్రిపురసుందరీ దేవి
నైవేద్యం: తీపిబూంది, శనగలు లేదా పెసరపప్పు పాయసం
వస్త్రం: ఆరెంజ్ రంగు చీర

రెండవ రోజు – గాయత్రీ దేవి
నైవేద్యం: రవ్వకేసరి, పులిహోర
వస్త్రం: నీలం రంగు చీర

మూడవ రోజు – అన్నపూర్ణ దేవి
నైవేద్యం: దద్ధోజనం, కట్టె పొంగలి
వస్త్రం: పసుపు రంగు చీర

నాల్గవ రోజు కాత్యాయని దేవి
నైవేద్యం: బెల్లం అన్నం, అన్నం–ముద్దపప్పు
వస్త్రం: పూర్తి ఎరుపు రంగు చీర

ఐదవ రోజు మహాలక్ష్మీ దేవి
నైవేద్యం: పూర్ణాలు, క్షీరాన్నం, బెల్లం లేదా పంచదారతో చేసినది
వస్త్రం: గులాబీ రంగు చీర

Crime News: షాకింగ్ మర్డర్స్.. భార్య, ప్రియుడి తలలు నరికి పోలీస్స్టేషన్కు వెళ్లిన భర్త!

ఆరవ రోజు లలితా త్రిపురసుందరీ దేవి
నైవేద్యం: పులిహోర, పెసర బూరెలు
వస్త్రం: ఆకుపచ్చ రంగు చీర

ఏడవ రోజు మహాచండీ దేవి
నైవేద్యం: లడ్డు ప్రసాదం
వస్త్రం: ఎరుపు రంగు చీర

ఎనిమిదవ రోజు – సరస్వతి దేవి
నైవేద్యం: పరవణ్ణం, అటుకులు, బెల్లం, శనగపప్పు, కొబ్బరి
వస్త్రం: తెలుపు రంగు చీర

తొమ్మిదవ రోజు – దుర్గాదేవి
నైవేద్యం: గారెలు, నిమ్మరసం కలిపిన అల్లంముక్కలు
వస్త్రం: ఎరుపు రంగు చీర

పదవ రోజు – మహిషాసురమర్ధిని దేవి
నైవేద్యం: చక్రపొంగలి, పులిహోర, గారెలు, వడపప్పు, నిమ్మరసం, పానకం
వస్త్రం: ఎరుపు రంగు చీర

పదకొండవ రోజు – రాజరాజేశ్వరి దేవి
నైవేద్యం: పులిహోర, గారెలు
వస్త్రం: ఆకుపచ్చ రంగు చీర.

Exit mobile version