NTV Telugu Site icon

Indrakeeladri: దుర్గమ్మకు కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించనున్న విజయవాడ సీపీ

Vja Cp

Vja Cp

Indrakeeladri: బెజవాడ కనక దుర్గమ్మకు సకుటుంబ సమేతంగా పట్టువస్త్రాలను విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా విజయవాడ వన్ టౌన్ పోలీస్ దగ్గరకు చేరుకున్న నగరంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది.. పోలీస్ కుటుంబాలతో కోలాహలంగా ఉన్న విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్.. పోలీస్ కుటుంబాలను అకట్టుకుంటున్న కోలాటం, చిన్నపిల్లల నృత్యాలు. ఈ సందర్భంగా విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ.. ఈ సారి దసరా ఉత్సవాలకు విజయవాడ కమీషనర్ గా ఉండటం నా అదృష్టం అన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పుకొచ్చారు.

Read Also: Vettaiyan Trailer: ‘వేట్టయన్- ద హంట‌ర్‌’ ట్రైలర్ విడుదల.. రజినీకాంత్ యాక్షన్ వేరేలెవల్ గురూ..

ఇక, వీఐపీలు కూడా వారికి కేటాయించిన సమయంలో కనక దుర్గమ్మ అమ్మవారి దర్శనాలు చేసుకొవాలని కోరుతున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు చెప్పారు. దేశ, విదేశాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం అన్నారు. రేపు ఉదయం నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం అవుతాయని చెప్పుకొచ్చారు.

Show comments