14 Days Remand For Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ రిమాండ్ విధించింది కోర్టు. వంశీతో పాటు కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌కు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అయితే.. వంశీ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కీలక అంశాలను చేర్చారు. సత్యవర్ధన్‌ను బెదిరించడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. వంశీ, అతడని అనుచరులు సత్యవర్ధన్‌ను బెదిరించినట్టు పోలీసులు రిమాండ్‌లో చేర్చారు. అంతేకాదు.. వంశీకి చట్టాలపై గౌరవం లేదని పేర్కొన్నారు.
Read Also: Ravibabu : ఎన్టీఆర్ హైట్ గురించి నిజంగా ఆ డైరెక్టర్ అంత మాట అన్నాడా.. ?
వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి రోడ్డు మార్గాన విజయవాడకు తీసుకెళ్లిన ఏపీ పోలీసులు. రాత్రి ACMM కోర్టులో హాజరుపర్చారు. వంశీతో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఏ7 ఎలినేని వెంకట శివరామకృష్ణ, ఏ8 నిమ్మ లక్ష్మీపతిలకు కూడా కోర్టులో హాజరుపర్చారు. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట 45 నిమిషాల వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు కొలిక్కి రాకపోవడంతో అదనంగా మరో అరగంటపాటు వాదనలు విన్నారు జడ్జి. ఆ తర్వాత వంశీతో పాటు శివరామకృష్ణ, నిమ్మ లక్ష్మీపతిలకు కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.
Read Also: VishwakSen : నేనేం భయపడను.. నాకు సినిమాలు చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు : విశ్వక్ సేన్
వంశీకి చట్టాలపై గౌరవం లేదని, అతనికి నేర చరిత్ర ఉందని, ఇప్పటి వరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. వంశీని పట్టుకునేందుకు ఎన్టీఆర్ జిల్లా సీపీ ఆదేశాలతో 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, విశాఖ పోలీసుల సమాచారంతో విజయవాడ తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ఈ కేసులో ఏ9గా ఉన్న పొట్టి రాము తనను కలవాలని వంశీ బలవంతం చేశారని, సత్యవర్ధన్ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంలో ఏ7, ఏ8 కీలకంగా వ్యవహరించారని అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపు, దాడి కేసులో వంశీతో పాటు మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు పోలీసులు. వంశీని విజయవాడ.. కృష్ణ లంక పోలీస్‌ష్టేషన్‌లో 8 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు. ఇంటరాగేషన్ ముగిశాక వంశీతో పాటు మిగతా నిందితులకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షలు ముగిశాక రాత్రి 10 గంటలకు కోర్టుకు తరలించి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. రిమాండ్ విధించడంతో వంశీని విజయవాడ సబ్ జైలుకు తరలించారు.