NTV Telugu Site icon

Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి వారాహి ఉత్సవాలు, సారె మహోత్సవాలు..

Kanaka Durga Temple

Kanaka Durga Temple

Kanaka Durga Temple: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో.. నేటి నుంచి రెండు ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి.. నేటి నుంచి దుర్గగుడిపై వారాహి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు.. ఇవాళ్టి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు అంటే.. 9 రోజుల పాటు నవరాత్రులు నిర్వహించనున్నట్టు శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో రామారావు ఇప్పటికే వెల్లడించారు.. అయితే.. ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు నిర్వహించడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు.. మరోవైపు.. నేటి నుంచి దుర్గగుడిలో ఆషాఢం సారె మహోత్సవాలు నిర్వహించబోతున్నారు.. ఆలయంలోని ఆరవ అంతస్తులో ఆషాఢ మాసపు సారెకు ఏర్పాట్లు చేశారు.. సారె ఇచ్చిన వారికి అమ్మవారి దర్శనాన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఆ తరువాత శాఖంబరీ ఉత్సవాలకు కావాల్సిన కూరగాయలు భక్తులు సమర్పించడానికి ముందుకు వస్తున్నారు.. జులై 19, 20వ తేదీలలో ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు కొనసాగనున్నాయి.. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆషాఢ సారె మహోత్సవం అద్భుతంగా జరుగుతుంది.. కదంబం ప్రసాదంగా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నామని ఆలయ ఈవో రామారావు వెల్లడించారు.

Read Also: YS Jagan: మరోసారి ఇడుపులపాయకు వైఎస్‌ జగన్‌

ఇక, వారాహి నవరాత్రులు వస్తున్నాయి.. వారాహి ఉపాసన, హోమం, హవనం, చండీ పారాయణ, రుద్రహోమం వారాహి నవరాత్రులలో నిర్వహిస్తారు.. నేటి నుంచి 15 వరకూ వారాహి నవరాత్రులు కొనసాగనున్నాయి. 14వ తేదీన మహంకాళీ ఉత్సవ కమిటీ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారు.. కనకదుర్గమ్మ ఆలయంలో బోనాలు సమర్పణకు విశేషంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జులై 26న ఇంద్రకీలాద్రి నుంచి భాగ్యనగరం మహంకాళి అమ్మవారి ఉమ్మడి దేవాలయాల ఉత్సవాలకు పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుందన్నారు. అయితే, కనకదుర్గమ్మ ఉన్న ఇంద్రకీలాద్రిపై సనాతనంగా ఉన్న శివలింగం స్వరణమయం అయింది. అత్యంత పురాతన ఆలయం పూర్తిగా అభివృద్ధి జరిగింది.. మహానివేదన సమయంలో సామాన్య భక్తులు అధిక సంఖ్యలో వేచి ఉంటారు.. ఆ సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు ఆపాలని నిర్ణయించామన్నారు. 11:45 నుంచి 12:15 వరకూ మహా నివేదన ఉంటుంది.. 11:30 నుంచి 1:30 వరకూ ప్రోటోకాల్ దర్శనాలు ఉండవు.. సామాన్య భక్తులకు దర్శనంలో ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆలయ అధికారులు చెబుతున్నారు.

Show comments