Vangaveeti Family: విజయవాడలో వంగవీటి ఫ్యామిలీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇవాళ (నవంబర్ 16న) ఉదయం 7 గంటలకు బందరు రోడ్డులోని రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించింది. అయితే,
దుబాయ్ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ ఉన్న సమయంలో వంగవీటి మోహన రంగా కూతురు ఆశా కిరణ్ రాజకీయ ఎంట్రీ ప్రకటనపై చర్చ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాలకొల్లులో వన భోజనాలకు వెళుతున్నాను.. ప్రస్తుతానికి రాజకీయరంగ ప్రవేశంపై ప్రకటన చేయడం లేదని పేర్కొన్నారు.
Read Also: Kavitha: కేసీఆర్ మళ్లీ పిలిస్తే బీఆర్ఎస్‌లోకి వెళ్తారా..? కవిత సమాధానం ఇదే..
అయితే, రాధా రంగా మిత్ర మండలిలో అందరినీ ఒక తాటికి తీసుకురావడం కోసం బయటికి వచ్చాను అని వంగవీటి ఆశా కిరణ్ తెలిపింది. ఏ పార్టీలోకి వెళ్లాలి అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని వెల్లడించింది. మా ఇద్దరి బాటలు వేరైనా ఆశయం మాత్రం ఒకటే.. కుటుంబ బాధ్యతల కారణంగా ఇవాళ్టి వరకూ బయటకు రాలేదు.. ఇక, ఇప్పటి నుంచి రంగా అభిమానులతో కలుస్తాను.. ఎవరికి ఏ అవసరం వచ్చినా, కష్టం వచ్చినా నేనున్నాను.. రాధా రంగా మిత్రమండలిలో గ్యాప్ ఉంది.. ఆ గ్యాప్ లేకుండా కృషి చేస్తానన్నారు. అలాగే, కాపు కులం మాత్రమే కాదు.. అన్ని కులాలకి చెందినవారు రంగా.. నేను కూడా అంతే అని చెప్పుకొచ్చింది వంగవీటి ఆశా కిరణ్.
