NTV Telugu Site icon

Vallabhaneni Vamsi Case: వంశీకి అనారోగ్య సమస్యలు.. డిప్రెషన్‌కు గురయ్యేలా చేస్తున్నారు..!

Pankaja Sri

Pankaja Sri

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీ మోహన్‌కు అనారోగ్య సమస్యలు ఉన్నాయి.. ఒంటరిగా ఉంచి డిప్రెషన్‌కు గురయ్యేలా చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు వంశీ భార్య పంకజ శ్రీ.. విజయవాడ సబ్ జైలులో ఉన్న వంశీని ఈ రోజు ములాఖత్‌లో కలిశారు పంకజ శ్రీ, వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన పంకజ శ్రీ.. వంశీకి ఆస్తమా, ఫిట్స్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి.. 6/4 బ్యారెక్ లో ఉండటం వల్ల వంశీ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.. ఫిజికల్‌గా వంశీని చాలా ఇబ్బందులు పడుతున్నారు.. 22 గంటలు ఒంటరిగా ఉంచుతున్నారు.. వంశీని పనిష్మెంట్ సెల్‌లో పెట్టారు.. అలా కాకుండా వేరేవారితో కలిపి ఉంచమని కోరుతున్నాం అన్నారు.. ఒంటరిగా ఉంచటం ద్వారా వల్లభనేని వంశీని డిప్రెషన్ కి గురయ్యేలా చేస్తున్నారని ఆరోపించారు.. అసలు సంబంధం లేని కేసుల్లో ఆయన్ని ఇరికించారు.. కనీసం చైర్ కూడా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు..

Read Also: Science Day Celebrations: నేను కూడా సైన్స్‌ విద్యార్థినే.. అధ్యాపకుడిగా పనిచేశా: రాజ్‌నాథ్‌ సింగ్‌

అక్రమ అరెస్ట్‌లు, వంశీ ఆరోగ్య సమస్యలు, రూమ్‌ మార్చడం వంటి విషయాల్లో లీగల్ గా ముందుకు వెళ్తాం అన్నారు వల్లభనేని వంశీ శార్య పంకజ శ్రీ.. భోజనం అనుమతి ఇవ్వలేదు.. కనీసం రూం మార్చాలని కోరుతున్నాం అని విజ్ఞప్తి చేశారు.. ఇక, సత్యవర్ధన్‌ కిడ్నాప్‌, బెదిరింపుల వ్యవహారంలో అరెస్టయిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. పోలీసులు కోర్టులో కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. మరోవైపు మూడు రోజు పోలీస్ కస్టడీ ముగియడంతో వంశీని నిన్న మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు పోలీసులు… మెజిస్ట్రేట్ ఎదుట వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆస్తమా సమస్య ఉన్నందునా.. జైల్‌లో నన్ను ఇతరులతో కలిపి ఉంచేలా ఆదేశించాలని కోర్టులో న్యాయాధికారిని కోరారు. వంశీ అభ్యర్థనను న్యాయాధికారి సత్యానంద్‌ తిరస్కరించిన విషయం విదితమే..