Site icon NTV Telugu

Vallabhaneni Vamsi Case: కోర్టులో వల్లభనేని వంశీ సెల్ఫ్ అఫిడవిట్.. నాకు సంబంధం లేదు..!

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi Case: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు వల్లభనేని వంశీ.. ఈ కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదని సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే వంశీ.. ఇక, సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి మళ్లీ సీన్ రీ కనస్ట్రక్ట్ అవసరం లేదని అఫిడవిట్‌లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వల్లభనేని.. అయితే, పోలీసుల అదుపులో ఉన్న సత్య వర్ధన్.. ఎవరు దాడి చేశారు..? ఎక్కడ దాడి చేశాడు..? అనేది చెబుతారు అని అఫిడవిట్ లో పేర్కొన్నారు..

Read Also: KCR: కేసీఆర్ కీలక ప్రకటన.. బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు తేదీ ఖరారు..

మరోవైపు, వల్లభనేని వంశీ మోహన్‌ పోలీస్ కస్టడీ పిటిషన్ పై వాదనలు పూర్తి అయ్యాయి.. మిగతా ఇద్దరి నిందితుల కస్టడీ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసింది న్యాయస్థానం.. మొత్తం ముగ్గురు కస్టడీ పిటిషన్లు మీద విచారణ పూర్తి అయ్యాక తీర్పు ఇవ్వనుంది కోర్టు..

Exit mobile version