NTV Telugu Site icon

Vijayawada Durga Prasadam: దుర్గమ్మ గుడికి వచ్చిన సరుకులను మరోసారి వెనక్కి పంపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

Durga

Durga

Vijayawada Durga Prasadam: బెజవాడ కనక దుర్గమ్మ గుడికి వచ్చిన సరుకులను మరోసారి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) అధికారులు వెనక్కి పంపించారు. 200 బాక్సుల కిస్ మిస్ ను వెనక్కి పంపినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. దసరా ఉత్సవాల్లో మొదటి రోజున పెద్ద సైజులో కిస్ మిస్ సరఫరా చేసి.. నేడు నాణ్యత, సైజ్ తక్కువగా ఉండటంతో వెనక్కి పంపినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికీ 10 రోజుల వ్యవధిలో మూడు సార్లు సరుకులను FSSAI ప్రమాణాలకు దూరంగా ఉండటంతో వెనక్కి పంపిన అధికారులు పేర్కొన్నారు. కాంట్రాక్టర్ పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే స్టోర్స్ ఇన్చార్జ్ పై వేటు వేసిన ప్రభుత్వం కాంట్రాక్టర్ పై చర్యలకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.

Read Also: Emirates flights: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం.. పేజర్ల, వాకీటాకీలపై నిషేధం

మరోవైపు, ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు వైభవంగా నగరోత్సవం కొనసాగింది. శేషవాహనంలో ఊరేగిన గంగా, పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి.. కనక దుర్గానగర్, ఘాట్ రోడ్డు మీదుగా ఆలయం వరకు కోలాటాలు, డప్పు వాయిద్యాల నడుమ కన్నుల పండువగా సాగింది. ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామి వారిలను భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు.

Show comments