Vijayawada – Hyderabad: భారీ వర్షాలు.. వరదలు.. కృష్ణా నదిలో వరద ఉధృతితో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. అయితే, ఇప్పుడు విజయవాడ-హైదరాబాద్ రూట్‌లో రాకపోకలకు లైన్ క్లియర్ అయ్యింది.. ఐతవరం దగ్గర హైవే పై చేరిన వరద నీరు తగ్గటంతో వాహనాలను అనుమతి ఇస్తున్నారు అధికారులు.. అయితే.. హైవేపై బురద పేరుకు పోవటంతో వాహనాలను నెమ్మదిగా ఆ ప్రాంతాన్ని దాటిస్తున్నారు.. కాగా, భారీ వర్షాల కారణంగా విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్ అయిన విషయం విదితమే.. వరద పోటెత్తడంతో నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై నుంచి వరద ప్రవాహం కొనసాగింది.. దీంతో.. రాకపోకలు నిలిచిపోయాయి..
Read Also: Ladakh: లడఖ్‌లో ఒంటరిగా బైక్ రైడ్.. ఆక్సిజన్ అందక యువకుడి మృతి
ఇక, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవే పైకి భారీగా వరద నీరు చేరడంతో ఈ పరిస్థితి వచ్చింది.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను.. ఖమ్మం వైపు, నార్కట్‌పల్లి- అద్దంకి రహదారి మీదుగా మళ్లించాల్సిన పరిస్థితి వచ్చింది.. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు నార్కట్‌పల్లి మీదుగా వయా మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడకు వాహనాలను మళ్లించారు.. దీంతో.. ప్రయాణికులకు.. వాహనదారులకు తిప్పలు తప్పలేదు.. కానీ, ఇప్పుడు ఐతవరం దగ్గర హైవేపై చేరిన నీరు తగ్గడంతో.. విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు పునర్‌ప్రారంభం అయ్యాయి.. దీంతో.. ప్రయాణికులు ఊపిరిపీల్చుకుంటున్నారు.