Sri Mahishasura Mardini Devi: దసరా మహోత్సవాలు పదవ రోజుకు చేరుకున్నాయి.. ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన దుర్గమ్మ మహార్నవమి నేడు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తున్నారు.. మహిషాసురమర్దిని అవతారానికి ప్రత్యేకత ఉంది.. రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసురమర్దని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అయితే, శరన్నవరాత్రులలో దర్శనమిస్తున్న దేవి అలంకారాలలో మహిషాసురమర్దనికి ఎంతో విశిష్టత ఉంది. సప్తశతిలో దుర్గాదేవి అష్టభుజాలతో దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకో పకారం చేసిన ఘట్టం వర్ణితమైంది.. సింహావాహినిగా రూపొందిన శక్తి వికటాట్టహాసం చేసి మహిషాసురిడి సేనాపతులైన చిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, బాష్కులుడు, బిడాలుడు, వంటి రాక్షసులందరినీ సంహరించింది. ఆ తర్వాత జరిగిన యుద్దంలో ఆ దేవి అవలీలగా మహిషాసురుణ్ణి చంపి అదే స్వరూపంతో కీలాద్రిపై స్వయంభువైంది. రౌద్రంలో ఉన్న అమ్మను శాంతిపచేసేందుకు ఇంద్రుడు తపస్సు చేసారు..
Read Also: Kaleshwaram Project: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 తుది గడువు!
అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై దుష్టుడైన మహిషాసురుడిని సంహరించింది. అమ్మవారి సహజస్వరూపం ఇదే. మహిషాసుర మర్ధనని దర్శించుకుంటే అరిషడ్వర్గాలు నశిస్తాయని, సాత్విక భావం ఏర్పడుతుంది. సర్వదోషాలు పటాపంచలై ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. గురువారంతో దసరా వేడుకలు ముగియనున్నందున ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. మహిషాసురమర్ధనిని దర్శించుకుంటే దసరా రోజు రాజరాజేశ్వరిని కూడా దర్శించుకోవాలనే నానుడి భక్తుల్లో ఇప్పటికీ నెలకొనిఉంది. కాగా, గత తొమ్మిది రోజులుగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న విషయం విదితమే.. దసరా మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు..
