AP Liquor Sscam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు చూపిస్తోంది.. ఈ కేసులో ఏసీబీ కోర్టులో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసింది సిట్.. అయితే, ఛార్జిషీట్‌పై ఏసీబీ కోర్టు పలు అభ్యంతరాలను లేవనెత్తుతూ.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.. దీంతో, ఛార్జిషీట్‌లో ఏసీబీ కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలపై ఈ రోజు కౌంటర్ దాఖలు చేసింది సిట్.. ప్రైమరీ ఛార్జ్‌షీట్, రెండో అదనపు ఛార్జిషీట్ లో మొత్తం 20కి పైగా అభ్యంతరాలు లేవనెత్తి.. నివృత్తి చేయాలని సిట్‌కు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేయగా.. వీటిని నివృత్తి చేస్తూ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సిట్.. సీల్డ్ కవర్ లో రెండు ఛార్జిషీట్లలో అభ్యంతరాలపై విడివిడిగా కౌంటర్లు కోర్టుకు సమర్పించింది సిట్..
Read Also: Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట!
కాగా, లిక్కర్ స్కాం కేసులో సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ల మీద ఏసీబీ కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం విదితమే.. రెండు ఛార్జ్‌షీట్లలో 21కి పైగా అభ్యంతరాలు తెలిపారు న్యాయమూర్తి. నిందితులు అందరికీ ముద్దాయి కాపీలు అందజేశారా..? అని ప్రశ్నించారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం ఎలా అప్లయ్ అవుతుందో చెప్పాలని అడిగారు. ఈ కేసులో సిట్ ఎంత మందిని సాక్షులుగా విచారించిందో వివరాలు ఇవ్వాలని కోరారు. ఎంత మంది సాక్షుల దగ్గర 164 స్టేట్‌మెంట్ రికార్డు చేశారని ప్రశ్నించింది ఏసీబీ కోర్టు. మధ్యవర్తుల రిపోర్టులు, సీజర్ రిపోర్టులు సమర్పించాలంది. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్‌లో FIR, రిమాండ్ రిపోర్ట్, ఛార్జ్‌షీట్ చూపించాలని కోరింది. సాక్షులు, డాక్యుమెంట్లను తగిన విధంగా సమర్పించాలని.. ఛార్జ్‌షీట్‌ల ఓచూపించిన డాక్యుమెంట్లకు CF నంబర్లు చూపించాలని కోర్టు ఆదేశించింది. రెండు చార్జిషీట్లలో ప్రిలిమినరీ లేదా ఫైనల్ చార్జీషీట్ అని చెప్పలేదన్నారు న్యాయమూర్తి. FSL రిపోర్టులు ఇంకా ఫైల్ చేయకుండా ఛార్జ్‌షీట్ ఎలా అర్హత పొందుతుందని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్‌లో 3500 కోట్లు ఎలా ట్రాన్స్‌ఫర్ అయ్యాయో టేబుల్ రూపంలో చూపాలన్నారు. కేసులో ఏడు నుంచి 15 వరకు ఉన్న నిందితులను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని కూడా ప్రశ్నించారు. స్కామ్‌లో వారి పాత్రను స్పష్టం చేయాలన్నారు. ప్రతి ముద్దాయికి ఏ సెక్షన్ వర్తిస్తుందో స్పష్టంగా చెప్పాలన్నారు. ఈ కేసులో ఎంత మంది అరెస్ట్ అయ్యారు… ఎన్ని రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారనే వివరాలు ఇవ్వాలన్నారు. అభ్యంతరాలపై మూడు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది కోర్టు.. దీంతో, ఈ రో జు కౌంటర్ దాఖలు చేసింది సిట్..
