Marriage Fraud: బెజవాడలో నిత్య పెళ్లి కూతురు అను ఆగడాలపై పోలీసులు విచారణ చేపట్టారు. నగరంలో పబ్స్ వేదికగా అక్కడకు వచ్చే వారిని టార్గెట్ చేసుకుని అను ఈ పెళ్లిళ్ల మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. గత నెల 9వ తేదీన దుర్గ గుడిలో ఒకరిని, అదే నెల 27వ తేదీన అన్నవరంలో మరొకరిని వివాహం చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే, గతంలో ఒక పబ్ లో పరిచయమైన యువతి బ్రాస్ లెట్ చోరీ చేయటంతో ఆ బాధితురాలు సీపీకి ఫిర్యాదు చేసినట్టు గుర్తించారు.
Read Also: Ravindra Jadeja: హీరోనా లేదా విలనా?.. లార్డ్స్‌లో జడేజా ఇన్నింగ్స్‌పై దిగ్గజాలు ఏమన్నారంటే?
అయితే, సతరు నిత్య పెళ్లి కూతురు ఇప్పటికే మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుని మోసాలకు పాలాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అను తనను మోసం చేసినట్టు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో దిమ్మ తిరిగే నిజాలు బయటకు వచ్చాయి. దీంతో ఇంకా నిత్య పెళ్లి కూతురు అను బాధితులు ఎంత మంది ఉన్నారో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
