Vijayawada: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం పెద్దలనే కాకుండా చిన్నారులను సైతం ఇబ్బంది పెడుతోంది. విజయవాడలో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రోడ్లు చెరువులను తలపిస్తాయి. ఈనేపథ్యంలో.. నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ఇద్దరు ఒకే హెలికాప్టర్ లో కూర్చుని విజయవాడకు బయలుదేరారు. కొద్ది సేపటి క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ , భట్టి విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ తో కలిసి ఖమ్మం జిల్లాలో బండి సంజయ్ కుమార్ ఏరియల్ సర్వే చేయనున్నారు. శివరాజ్ సింగ్, బండి సంజయ్ తోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి మధిర మీదుగా ఖమ్మం జిల్లాలోని కట్టలూరు, మీనవోలు, ప్రకాశ్ నగర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. కూసుమంచి మండలం జుజ్జులురావుపేట గ్రామంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న కాలువను, పంట నష్టపోయిన పొలాలను శివరాజ్ సింగ్, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు సందర్శించనున్నారు.
Read also: Jitta Balakrishna Reddy: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత!
అనంతరం పాలేరు ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రులు పరిశీలిస్తారు. అక్కడే భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులతో శివరాజ్ సింగ్, బండి సంజయ్ మాట్లాడనున్నారు. అక్కడి నుండి మోతె హెలిప్యాడ్ వద్దకు చేరుకుని హైదరాబాద్ బయలుదేరనున్నాఉ. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట చేరుకుంటారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి నేరుగా రాష్ట్ర సచివాలయానికి చేరుకోనున్నారు. సచివాలయంలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. 10 ఏళ్ల తరువాత తొలిసారిగా రాష్ట్ర సచివాలయానికి బండి సంజయ్ కుమార్ రాబోతున్నారు. వరద నష్టంపై కేంద్ర మంత్రి హోదాలో సీఎంతో కలిసి తొలిసారి మీటింగ్ లో పాల్గొననున్నారు. సచివాలయంలో మీటింగ్ అనంతరం శివరాజ్ సింగ్ తో కలిసి బండి సంజయ్ బేగంపేటకు చేరుకోనున్నారు. బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ వెళ్లనున్నట్లు సమాచారం. శివరాజ్ సింగ్ కు వీడ్కోలు అనంతరం బండి సంజయ్ నేరుగా కరీంనగర్ బయలుదేరనున్నారు. శివరాజ్ సింగ్ తో కలిసి హైదరాబాద్ వెళ్లాల్సిన నేపథ్యంలో కోదాడ పర్యటనను రద్దు చేసుకున్నారు.
Telangana Govt: నేటి నుంచి ఖమ్మంలో వరద బాధితులకు రూ. 10వేలు పంపిణీ..