Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. మళ్లీ బెజవాడకు సీబీఐ

Saikrishna Case Cbi

Saikrishna Case Cbi

Saikrishna Custodial Death Case: ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. మరోసారి విచారణ చేపట్టేందుకు సీబీఐ బృందం బెజవాడకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి గత నెలలోనూ సీబీఐ అధికారులు పది రోజులపాటు విజయవాడలో మకాం వేసి కీలక వివరాలు సేకరించారు. అక్టోబర్ 23 నుంచి పది రోజులపాటు విచారణ కొనసాగించారు. ఈ క్రమంలో మృతుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని, కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోనూ సీబీఐ అధికారులు విచారించారు. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న వెంకటరాజు, సురేష్‌లను సైతం ప్రశ్నించి పలు వివరాలు రాబట్టారు. తాజాగా మరోసారి బెజవాడకు చేరుకున్న సీబీఐ బృందం కేసు దర్యాప్తును కొనసాగిస్తోంది. మరోవైపు, ఈ కేసుకు సంబంధించి సేకరించిన వివరాలు, దర్యాప్తు పురోగతిపై సీబీఐ అధికారులు ప్రాథమిక విచారణ నివేదికను సీబీఐ కోర్టులో దాఖలు చేయనున్నట్లు సమాచారం. దీంతో సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీబీఐ తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.