ప్రధాని మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈరోజు ఏపీలో పర్యటించిన ప్రధాని, ఈ నెల 8వ తేదీన విజయవాడకు రానున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు. ప్రధాన రోడ్లలో సరుకు రవాణా వాహనాలు, భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు సహా అన్ని వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపులు చేయనున్నారు. మరోవైపు.. రోడ్ షోలో పాల్గొనటం కోసం వచ్చే వారికి పార్కింగ్ స్థలాలు నిర్ణయించారు విజయవాడ పోలీసులు.
BSNL 4G: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త.. త్వరలో దేశమంతా 4జీ సేవలు..
ఈ క్రమంలో… ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో సీపీ సమీక్ష చేపట్టారు. ప్రధాని పర్యటన సందర్భంగా నగరంలో రెడ్ జోన్ అమలుకు నిర్ణయం తీసుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు మరియు ఓల్డ్ పి.సి.ఆర్. జంక్షన్ నుండి బెంజ్ సర్కిల్ వరకు రెడ్ జోన్ అమలు చేయనున్నారు. రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర ఏరియాను రెడ్ జోన్ ( నో ఫ్లయింగ్ జోన్ )గా నిర్ణయం తీసుకున్నారు. జోన్ గా నిర్ణయించిన ప్రాంతంలో డ్రోన్స్, బెలూన్స్ ఎగరవేయుట నిషేధం విధించారు. అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి పి.వి.పి.మాల్ వరకు మరియు బెంజ్ సర్కిల్ నుండి గన్నవరం విమానాశ్రయం వరకు రూట్ బందోబస్త్ పై సమీక్ష చేపట్టారు. పి.వి.పి.మాల్ నుండి బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షో (1.3 KM) ఉన్న క్రమంలో… బందోబస్త్కి 5 వేల మంది పోలీసులతో పకడ్బంధీ చర్యలు చేపట్టనున్నారు.