Mushrooms Price: కొండెక్కిన పుట్టగొడుగుల ధర..! చికెన్, మటన్‌తో పోటీ..
- విజయవాడ మార్కెట్ లో పుట్టగొడుగులకు ఫుల్ డిమాండ్..
- వర్షాకాలంలో మాత్రమే దొరికే నాటు పుట్టగొడుగుల కోసం పోటీ..
- పుట్టగొడుగుల ధర వింటేనే సామాన్యులకు షాక్..
- చికెన్, మటన్ ధరలతో పోటీపడుతోన్న పుట్టగొడుగుల ధర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mushrooms Price: వర్షాలు కురుస్తుండడంతో పుట్టగొడుగుల (Mushrooms) సీజన్ కూడా ప్రారంభం అయ్యింది.. కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరికే నాటు పుట్టగొడుగులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.. అయితే, పుట్టగొడుగుల ధర వింటేనే సామాన్యులకు షాక్ తగులుతోంది అంటున్నారు.. భోజన ప్రియులకు ఇష్టమైన పుట్టగొడుగులు ధర ప్రస్తుతం చికెన్, మటన్ తో పోటీపడుతోంది. కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరికే నాటు పుట్టగొడుగులు ధర వింటేనే షాక్ కొట్టినంత పని అవుతుంది.. పది చిన్న చిన్న పీసులు కలిగిన నాటు పుట్టగొడుగులు కట్ట ధర 150 నుంచి 200 రూపాయల వరకు పలుకుతోంది.. గతంలో వీటి ధర పది నుంచి 50 రూపాయలు మాత్రమే పలికేది.. కానీ, ప్రస్తుతం నగరాలు విస్తరిస్తున్న వేళ పుట్టగొడుగులు కూడా అక్కడక్కడ మాత్రమే దొరుకుతున్న పరిస్థితి.. దీనితో మాంసాహారం ధరలతో పోటీగా పుట్టగొడుగుల ధర కూడా పలుకుతుంది..
Read Also: RK Roja: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై 420 కేసు పెట్టాలి.. మాజీ మంత్రి డిమాండ్..
Also Read
- Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్‌షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
అయినప్పటికీ వాటిని ఇష్టంగా తినే భోజనం ప్రియులు మాత్రం కొనుగోలు చేయటానికి వెనుకాడటం లేదు.. ఎందుకంటే ఇవి దొరికేది కూడా కేవలం వర్షాలు పడే సమయంలో మాత్రమే కావడంతో ధర ఎంత ఉన్న కొనటానికి ఆలోచన చేయటం లేదు.. విజయవాడ నగరంలో గంటల వ్యవధిలోనే నాటు పుట్టగొడుగులు అమ్ముడైపోతున్నాయి.. ఇవి తింటే పోషకాలు కూడా వస్తాయి కాబట్టి శాఖాహారులతోపాటు మాంసాహారులు కూడా ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. ధర ఇబ్బంది పెట్టిన మళ్లీ అవి దొరుకుతాయో లేదో అని కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు వినియోగదారులు. కాగా, పుట్టగొడుగుల్లోని పోషక లక్షణాలు, బయోయాక్టివ్ సమ్మేళనాలు.. ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని చెబుతారు.. ఇవి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలకు మంచి మూలం. అంతేకాదు కొన్ని పుట్ట గొడుగులు ప్రీబయోటిక్ లక్షణాలను కలిగి ఉండడంతో.. పేగు ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
-
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
-
Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
-
Gautam Gambhir: కోచింగ్ శైలిపై ఆటగాళ్ల అసంతృప్తి.. గంభీర్‌పై బీసీసీఐకి సీనియర్ల ఫిర్యాదు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!