Site icon NTV Telugu

Mushrooms Price: కొండెక్కిన పుట్టగొడుగుల ధర..! చికెన్, మటన్‌తో పోటీ..

Mushrooms Price

Mushrooms Price

Mushrooms Price: వర్షాలు కురుస్తుండడంతో పుట్టగొడుగుల (Mushrooms) సీజన్‌ కూడా ప్రారంభం అయ్యింది.. కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరికే నాటు పుట్టగొడుగులకు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది.. అయితే, పుట్టగొడుగుల ధర వింటేనే సామాన్యులకు షాక్‌ తగులుతోంది అంటున్నారు.. భోజన ప్రియులకు ఇష్టమైన పుట్టగొడుగులు ధర ప్రస్తుతం చికెన్, మటన్ తో పోటీపడుతోంది. కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరికే నాటు పుట్టగొడుగులు ధర వింటేనే షాక్‌ కొట్టినంత పని అవుతుంది.. పది చిన్న చిన్న పీసులు కలిగిన నాటు పుట్టగొడుగులు కట్ట ధర 150 నుంచి 200 రూపాయల వరకు పలుకుతోంది.. గతంలో వీటి ధర పది నుంచి 50 రూపాయలు మాత్రమే పలికేది.. కానీ, ప్రస్తుతం నగరాలు విస్తరిస్తున్న వేళ పుట్టగొడుగులు కూడా అక్కడక్కడ మాత్రమే దొరుకుతున్న పరిస్థితి.. దీనితో మాంసాహారం ధరలతో పోటీగా పుట్టగొడుగుల ధర కూడా పలుకుతుంది..

Read Also: RK Roja: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై 420 కేసు పెట్టాలి.. మాజీ మంత్రి డిమాండ్..

అయినప్పటికీ వాటిని ఇష్టంగా తినే భోజనం ప్రియులు మాత్రం కొనుగోలు చేయటానికి వెనుకాడటం లేదు.. ఎందుకంటే ఇవి దొరికేది కూడా కేవలం వర్షాలు పడే సమయంలో మాత్రమే కావడంతో ధర ఎంత ఉన్న కొనటానికి ఆలోచన చేయటం లేదు.. విజయవాడ నగరంలో గంటల వ్యవధిలోనే నాటు పుట్టగొడుగులు అమ్ముడైపోతున్నాయి.. ఇవి తింటే పోషకాలు కూడా వస్తాయి కాబట్టి శాఖాహారులతోపాటు మాంసాహారులు కూడా ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. ధర ఇబ్బంది పెట్టిన మళ్లీ అవి దొరుకుతాయో లేదో అని కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు వినియోగదారులు. కాగా, పుట్టగొడుగుల్లోని పోషక లక్షణాలు, బయోయాక్టివ్ సమ్మేళనాలు.. ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని చెబుతారు.. ఇవి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలకు మంచి మూలం. అంతేకాదు కొన్ని పుట్ట గొడుగులు ప్రీబయోటిక్ లక్షణాలను కలిగి ఉండడంతో.. పేగు ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు..

Exit mobile version