NTV Telugu Site icon

Vijayawada: ఇంద్రకీలాద్రిలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు సమీక్ష

Indrakeeladri

Indrakeeladri

Vijayawada: ఈ నెల 15 నుంచి ఇంద్రకీలాద్రిపై ప్రారంభం కానున్న దసరా ఉత్సవాల ఏర్పాట్ల పై అధికారులు సమీక్షించారు. ఈ సమీక్షలో ఎండోమెంట్ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని, వీఎంసీ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్, ఈఓ భ్రమరాంబ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఎండోమెంట్ సీఎస్ కరికాల్ వలవన్ మాట్లాడుతూ.. దసరాకి సంబంధించిన ఏర్పాట్లను పూర్తిగా పరిశీలించామని తెలిపారు. క్యూలైన్లు, కేశఖండనశాల, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాలు, లడ్డు ప్రసాదాల కౌంటర్లు పరిశీలించామన్నారు.

Read Also: Minister Adimulapu: తప్పు చేసిన వారు ఎంతటి వారైనా న్యాయస్థానాల ముందు నిలబడాల్సిందే

క్యూలైన్లో ప్రతి 50 అడుగుల దూరానికి ఒక ఎగ్జిట్ పాయింట్ పెట్టామని.. చంటి పిల్లలకి పాలు, బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్ ఏర్పాటు చేసామని తెలిపారు. అంచనాలకు మించి భక్తులు వచ్చినా.. ఎటువంటి ఇబ్బంది పడకుండా పక్కా ప్రణాళిక రూపకల్పన చేశామని పేర్కొన్నారు. దసరా నవరాత్రి ఉత్సవాలకు బడ్జెట్ గురించి ఆలోచించమని.. ఎంత ఖర్చైనా భక్తుల సౌకర్యం తమకు ముఖ్యమన్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావ్ మాట్లాడుతూ.. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు కావలసిన సౌకర్యాల్ని ఏర్పాటు చేసామన్నారు. వీఐపీలకు టైం స్లాట్ లేదని… అంతరాలయ దర్శనం కేవలం వీఐపీలకు మాత్రమేనన్నారు. పార్కింగ్ కి సంబంధించి కూడా పుర్తిస్తాయిలో ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఢిల్లీ రావ్ తెలిపారు.

Read Also: Jangaon BRS: జనగామ బీఆర్ఎస్ టికెట్పై వీడిన ఉత్కంఠ