Site icon NTV Telugu

AP FiberNet Case: ఫైబర్ నెట్ కేసులో కొత్త ట్విస్ట్..!

Kurnool Pocso Court

Kurnool Pocso Court

AP FiberNet Case: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై నమోదైన ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.. 2023లో ఫైబర్ నెట్ టెండర్లలో అక్రమాలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసింది.. అయితే, ఈ కేసులో చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చారు.. అప్పుడు ఫైబర్ నెట్ చైర్మన్ గా పనిచేసిన గౌతమ్ రెడ్డి అక్రమాలపై ఎండీ మధుసూదన్ రెడ్డికి రాసిన లేఖను ఆయన విచారణ జరపాలని సీఐడీకి పంపారు.. విచారణ జరిపిన సీఐడీ కేసు నమోదు చేసింది.. సుమారు 300 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగాయని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది..

Read Also: Joe Root Saves Hayden: సెంచరీ చేయకపోతే నగ్నంగా నడుస్తా.. హేడెన్ ఇజ్జత్ కాపాడిన రూట్

ఫైబర్ నెట్ కు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో పాల్గొన్న సంస్థలన్నీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి టెండర్లు కట్టబెట్టారు అనేది.. అక్రమాలు జరిగాయిని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.. ప్రధానంగా తరాసాఫ్ట్ సంస్థ బ్లాక్ లిస్టులో ఉన్న దానికి టెండర్లు అప్పగించారని దాని సంస్థ యజమానికి ఫైబర్ నెట్ లో డైరెక్టర్ గా స్థానం కల్పించారని పేర్కొన్నారు.. విచారణలో భాగంగా కొందరిని అరెస్ట్ చేయటంతో పాటు కొన్ని ఆస్తులును అటాచ్‌మెంట్‌ కూడా చేసేందుకు అప్పట్లో సిద్దమయ్యారు.. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆధారాలు లేవని సీఐడీ, సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు.. అభ్యంతరాలకు సంబంధించి కూడా తాజా మాజీ ఎండీలు అభ్యంతరాలు లేవని చెప్పడంతో కేసు క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది.. దీంతో ఈ సమాచారం తనకు వచ్చిందని అప్పట్లో చైర్మన్ గా ఉన్న తాను అక్రమాలపై ఎండీకి తెలియజేస్తేనే కేసు నమోదు అయిందని.. తనకు ఎటువంటి సమాచారం కానీ తన అభ్యంతరాలను గాని పరిగణలోకి తీసుకోకుండా కేసు ఎలా క్లోజ్ చేస్తారు అంటూ గౌతమ్ రెడ్డి ఏసీబీ కోర్టులో ప్రొటెక్షన్ క్లోసింగ్ పిటిషన్ దాఖలు చేశారు.. దీనిపై సోమవారం విచారణ జరగనుంది ..

Exit mobile version