NTV Telugu Site icon

Nellimarla Jute Mill Lockout: మళ్లీ మూతపడిన నెల్లిమర్ల జూట్‌మిల్‌..

Nellimarla Jute Mill

Nellimarla Jute Mill

Nellimarla Jute Mill Lockout: విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల జూట్‌మిల్‌ మరోసారి మూతపడింది. జూట్ కొరతను కారణంగా చూపి కర్మా గారాన్ని లాకౌట్ చేస్తున్నట్టు యాజమాన్య ప్రకటించింది. గడచిన వారం రోజులగా ఉద్యోగులకు ఎలాంటి పని చెప్పకుండా ఖాళీగా ఉంచింది యాజమాన్యం… ఇలాగా గతంలో తరచూ మిల్లును లాకౌట్ చేస్తుండటంతో కార్మికులు ఆందోళన గురయ్యారు. ఇప్పుడు లాకౌట్ ప్రకటించడంతో మిల్లులో పనిలేక, వేరేపనికి వెళ్లలేక కార్మిక కుటుంబాలు యాతన పడుతున్నారు. అయితే, జూట్‌మిల్లులో సుమారు 200 మంది రెగ్యులర్, మరో 1,800 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ముడి సరుకు కొరత పేరిట యాజమాన్యం మిలును అక్రమంగా మూసివేయడంపై కార్మిక కుటుంబాల ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.. కొన్నేళ్లుగా ఈఎస్ఐ, పీఎఫ్ బకాయిలు చెల్లించడంలోయాజమాన్యం నిర్లక్ష్యం వల్ల కార్మికులకు ఎలాంటి సదుపాయాలు అందటం లేదంటున్నారు.. 2016 నుంచి గ్రాట్యుటీ బకాయిలు కూడా ఉండిపోయాయని.. ఇప్పుడు ఏకంగా లాకౌట్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అయితే, వెంటనే ఈ వ్యవహారంలో.. ప్రభుత్వం జోక్యం చేసుకొని జూట్‌ మిల్‌ను తెరిపించాలని.. తమకు ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఉద్యోగులు, కార్మికులు..

Read Also: Delhi Weather: ఢిల్లీలో భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్ట్ జారీ