Gautam Reddy: తనకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పూనూరి గౌతమ్‌రెడ్డి.. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ను కలిసేందుకు వచ్చిన పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరి గౌతమ్‌రెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉండే విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగటం సరికాదు అన్నారు.. ప్రశాంతంగా ఉండే నగరాన్ని కలుషితం చేయాలని చూస్తున్నారా..? అని మండిపడ్డారు.. నా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి మరి దాడులు చేస్తున్నారు. నన్ను ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారన్న ఆయన.. దాడి చేసిన వారిని పట్టుకోవటంలో పోలీసులు విఫలమయ్యారనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.. రక్షించాల్సిన వాళ్లే భక్షిస్తున్నారు. ఇలాంటివి జరుగుతుంటే సైలెంట్ గా ఎందుకు ఉన్నారు? పోలీసుల పాత్ర కూడా ఉందా అనే అనుమానం ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు..
Read Also: Mohanlal : మలయాళ సినిమా రికార్డులు తిరగరాస్తున్న మోహన్ లాల్ అండ్ సన్
ఇక, నాకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది అన్నారు గౌతమ్ రెడ్డి.. గతంలో నాకు గన్ మెన్ కూడా ఇచ్చారు.. వైఎస్ జగన్ తో ప్రయాణం చేస్తున్న నాపై సిరీస్ గా దాడులు జరుగుతున్నాయి.. పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.. వీడియోలు కూడా అందించినా ఎందుకు చర్యలు తీసుకోలేదు..? అని నిలదీశారు గౌతమ్ రెడ్డి.. కాగా, విజయవాడలోని గౌతమ్ రెడ్డి నివాసం సమీపంలో పార్క్ చేసి ఉంచిన కొత్త కారుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తి.. ఆ తర్వాత అక్కడి నుంచి పరిపోయాడు.. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ, ఓ బ్యాగ్‌తో అక్కడికి వచ్చాడు. ఆ బ్యాగ్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను కారుపై పోసి, అనంతరం నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన గత నెల 12వ తేదీన జరిగినట్లు సమాచారం. తన కారుకు మంటలు అంటుకున్న ఘటనపై గౌతమ్ రెడ్డి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
