Site icon NTV Telugu

Komatireddy Rajagopal Reddy: పార్టీ మార్పుపై మరోసారి స్పందించిన రాజగోపాల్‌ రెడ్డి.. ఏమన్నారంటే..?

Rajagopal Reddy

Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy: ఈ మధ్య వరుసగా సీఎం రేవంత్‌ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ వెళ్లడంతో.. పెద్ద ప్రచారమే తెరపైకి వచ్చింది.. ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారని.. ఏపీ పర్యటనలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌తో భేటీ అవుతున్నారని.. ఇక పార్టీ మారుడే మిగిలిందనే ప్రచారం జోరుగా సాగుతూ వచ్చింది.. అయితే, ఆ వార్తలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి.. విజయవాడ కనక దుర్గమ్మ సాక్షిగా తనపై వస్తున్న తప్పుడు కథనాలను దుష్ప్రచారాలను మరోసారి తీవ్రంగా ఖండించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి..

Read Also: Deputy CM Pawan Kalyan: ప్లాస్టిక్ నిరోధానికి మూలాలపై దృష్టి.. పర్యావరణ పరిరక్షణకు సహకారం..

కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు రాజ్ గోపాల్ రెడ్డి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. నిన్న ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనడానికి గుంటూరు వచ్చాను. ఈరోజు విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకున్నాను.. నేను ఇక్కడికి బయలుదేరినప్పటి నుండి రాజకీయంగా నా పై దుష్ప్రచారం చేస్తున్నారు.. నేను నిన్ననే మీడియా ముందు క్లారిటీ ఇచ్చాను.. కొంతమంది కావాలని నా ప్రతిష్టను దెబ్బతీయడానికి దుష్ప్రచారం చేస్తున్నారు.. వాటిని నమ్మకండి.. నేను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోవడం లేదు అన్నారు..

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అన్నదమ్ములు లాగా కలిసి ఉండి రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండి అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని అమ్మవారిని ప్రార్థించాను అన్నారు రాజగోపాల్‌రెడ్డి.. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదలకు అండగా ఉండే కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు.. అయితే, బల ప్రదర్శన నిరూపించడానికి అమ్మవారి దర్శనానికి రాలేదు.. మా అనుయాయులతో నిన్న ఒక ప్రోగ్రామ్ కి వెళ్లి ఇవాళ అమ్మవారి దర్శనానికి వచ్చాను అన్నారు.. నేను జగన్ ని కలుస్తున్నానని విపరీతమైన ప్రచారం చేస్తున్నారు.. అందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు.. నేను జగన్ ని కలవలేదని స్పష్టం చేశారు.. నేను పార్టీ మారుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. నాకు పార్టీ మారే ఉద్ధేశ్యం లేదు.. కానీ, నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి..

Exit mobile version