Kolikapudi vs Kesineni Chinni: తెలుగు దేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని ఇసుక, లిక్కర్ మాఫీయాను పెంచి పోషించడంతో పాటు పార్టీ పదవులు అమ్ముకుంటున్నారు.. తనకు టికెట్ ఇవ్వడానికి కూడా చిన్నికి డబ్బులు తీసుకున్నాడని కొలికపూడి ఆరోపణలు చేశారు. ఈ అంశంపై చిన్ని కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. టికెట్ల కోసం డబ్బులు తీసుకునే నైజం తనది కాదన్నారు.. కానీ, టోటల్ ఎపిసోడ్ పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.. యువకులు కదా అని టికెట్లు ఇస్తే ఇలాంటి పరిస్థితి వచ్చిందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఈరోజు క్రమశిక్షణా కమిటీ ముందు హాజరు కావాలని ఇద్దరు నేతలకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Tollywood Stars : మొన్నJr. NTR.. నిన్నరామ్ చరణ్.. నేడు రామ్ పోతినేని
ఈ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ ఎదుట తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ హాజరయ్యారు. ఏ నేపథ్యంలో ఎంపీ కేశినేని చిన్నిపై ఆరోపణలు చేయాల్సి వచ్చింది అనే దానిపై ఆయన వివరణ ఇవ్వనున్నారు. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అధ్యక్షతన టీడీపీ క్రమ శిక్షణా సంఘం ముందుకు కొలికపూడి వెళ్లారు. కేశినేని చిన్నిపై చేసిన వ్యాఖ్యలు గతంలో తాను చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కొలికపూడి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని విజయవాడ ఎంపీ చిన్నికి టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.
