Minister Anitha: గత 30 ఏళ్లలో కడపలో ఎక్కడైనా స్వచ్ఛందంగా ఓటు వేసే పరిస్థితి లేదని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కనీసం నామినేషన్ కూడా వేసే పరిస్థితి లేకండా జగన్ మోహన్ రెడ్డి రూల్ చేశాడు.. కానీ ప్రస్తుతం ప్రతీ ఒక్కరు స్వఛ్ఛందంగా బయటకు వచ్చి ఓటు వేశారు.. ప్రజాస్వామ్యం రుచి చూసారు.. ఒక్క రాష్ట్రమే కాదు.. పులివెందుల, ఒంటిమిట్ట కూడా కూటమి వైపు ఉన్నాయని ఈ విజయం ద్వారా తెలుస్తుంది.. ఆరు వేల ఓట్లతో పులివెందుల జెడ్పీటీసీ మెజారిటీతో కైవసం చేసుకున్నాం.. కూటమి ప్రభుత్వాన్ని పులివెందుల ప్రజలు స్వాగతం పలికారు.. వైసీపీకి కనీసం డిపాజిట్ రాలేదు అని ఎద్దేవా చేసింది. ప్రజాస్వామ్యాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్న వారి ఎవరు నష్టపోలేదు.. రాజా రెడ్డి రాజ్యాంగాన్ని నమ్ముకుని జగన్ మోహన్ రెడ్డి 151 సీట్లు నుంచి 11 సీట్లుకి పడిపోయారని ఆరోపించింది. పోలింగ్ బూత్ లు మార్చమని గోల చేశారు.. మార్చడం అనేది ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది.. గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులను వారి సొంత పనులకు వాడుకున్నారు.. పోలీసులను గౌరవంగా పని చేసుకునే పరిస్థితి లేదని వంగలపూడి అనిత పేర్కొన్నారు.
Read Also: SP MLA suspended: ఉత్తరప్రదేశ్ సీఎంపై పొగడ్తలు.. కట్ చేస్తే పార్టీ సస్పెన్షన్..!
ఇక, తాడేపల్లి నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది.. ఆ స్క్రిప్ట్ ను వైసీపీ వాళ్ళు అమలు చేస్తున్నారని మంత్రి అనిత తెలిపింది. సొంత పార్టీకి చెందిన పేర్ని నాని తప్పుగా మాట్లాడితే ఖండించలేదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు వయసుకు కూడా గౌరవం ఇవ్వడం లేదు.. మాకు ఒక సంస్కారం ఉంది.. వైసీపీలా నోటికి వచ్చినట్టు మాట్లాడడం సరికాదు.. జగన్ 30 ఏళ్ళ సీఎం అని చెప్పుకుని 11 సీట్లకు పడిపోయారు.. కానీ, చంద్రబాబు రోజుకు 18 గంటల పాటు పని చేస్తున్నారని పేర్కొనింది. చంద్రబాబును టచ్ చేయకూడదు.. ఆ రోజు టచ్ చేశావ్ జగన్.. ఈ రోజు నీకు ప్రతిపక్షం కూడా లేదని తెలిపింది. సంస్కారం లేని వాళ్ళ గురించి మేము మాట్లాడాం.. పులివెందులకు, కడపకు నీళ్ళు ఇచ్చిన ఘటన ఒక్క చంద్రబాబుదే.. నెలకు నాలుగు రోజుల మాత్రమే జగన్ ఏపీకి వస్తాడని మంత్రి వంగలపూడి అనిత చెప్పుకొచ్చింది.
Read Also: Pilli Subhash Chandra Bose: ఏజెంట్లు రాకుండా కూటమి నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారు..
అయితే, రాజకీయం ఎలా చేయాలో కూడా తెలియని వ్యక్తి జగన్ అని వంగలపూడి అనిత పేర్కొనింది. విలువులతో కూడిన రాజకీయాలు చేయ్.. మేము కూడా స్వాగతిస్తామన్నారు. పోలీస్ ఉద్యోగాలు తీయడానికి ఆయన ఎవరు.. నిత్యం ఖాకీ చొక్కా వేసుకుని వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు.. గత ఐదేళ్లు పోలీస్ శాఖతో ఊడిగం చేయించుకున్నాడు.. ప్రతి పనికి పోలీసులను వాడుకున్నాడు.. చంద్రబాబు పాలనలో పని చేసిన ఏ ఒక్క ఉద్యోగి కూడా జైలుకు వెళ్లలేదు.. కానీ, జగన్ ప్రభుత్వంలో పని చేసిన ఉద్యోగులు జైలుకు వెళ్లారని సెటైర్లు వేసింది. ఇదే చంద్రబాబు పాలనకు నిదర్శనం.. బాధ్యతగా పని చేయాల్సిన అవసరం మా మీద ఉంది.. లా అండ్ ఆర్డర్ విషయంలో దేశంలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది.. సూపర్ సిక్స్ లో ఉన్న ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నాం.. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని వంగలపూడి అనిత వెల్లడించింది.
