Site icon NTV Telugu

Maoists in Vijayawada: విజయవాడలో మావోయిస్టుల కలకలం..

Maoists In Vijayawada

Maoists In Vijayawada

Maoists in Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోవడం వద్ద మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ జరిగింది.. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత హిడ్మాతో పాటు అతని భార్య హేమ మరో నలుగురు మావోయిస్టు మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు.. హిడ్మాపై కోటి రూపాయలకు పైగా రికార్డు ఉండగా.. ఆయన భార్య హేమపై రూ.50 లక్షల పైగా రివార్డు ఉంది.. అయితే, మరోవైపు విజయవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టించాయి.. నగరంలోని కానూరు ప్రాంతంలో మావోయిస్టుల ఉధృత కదలికలపై సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బ్రాంచ్ (SIB) ద్వారా సమాచారం అందింది. సుమారు 27 మంది మావోయిస్టులు అక్కడ ఉన్నట్టు గుర్తించబడింది.

Read Also: Winter Hydration: చలి కాలంలో తగనంత వాటర్ తాగకపోతే ఏమవుతుందో తెలుసా..

అదేవిధంగా, స్థానిక పోలీసులు, గ్రే హౌండ్స్ ప్రత్యేక బలగాలు కలిసి భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఇక మిగిలిన ఆరుగురిని కోసం పోలీసులు ప్రాంతంలో గాలింపును కొనసాగిస్తున్నారు. ఆటోనగర్‌లో ఒక భవనాన్ని షెల్టర్‌ జోన్‌గా మార్చుకున్నట్టు అనుమానిస్తున్నారు.. 27 మంది మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం.. భవనాన్ని చుట్టుముట్టిన ఆక్టోపన్‌ పోలీసులు.. భవనంలో భారీగా ఆయుధాలు డంప్‌ చేసినట్టు గుర్తించారు.. అరెస్ట్ అయిన నలుగురు మావోయిస్టులను టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు, అక్కడ వారిపై కఠిన విచారణ ప్రారంభమయ్యింది. పోలీసుల ప్రకారం, ఈ ఆపరేషన్ ద్వారా ప్రాంతంలో మావోయిస్టుల ఉధృత కదలికలను అడ్డుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి పక్కనే ఉన్న విజయవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి..

Exit mobile version