Site icon NTV Telugu

Kesineni Chinni vs Kesineni Nani: కేశినేని బ్రదర్స్ మధ్య ముదురుతున్న వార్..

Kesineni Nani

Kesineni Nani

Kesineni Chinni vs Kesineni Nani: విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య వార్ ముదురుతుంది. మాజీ ఎంపీ కేశినేని నానికి టీడీపీ ఎంపీ చిన్ని లీగల్ నోటీసు పంపించారు. రూ. 100 కోట్లు నష్ట పరిహారం కోరుతూ ఈ లీగల్ నోటీసులు జారీ చేశారు. కాగా, కేశినేని చిన్ని పంపిన లీగల్ నోటీసులపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మాజీ ఎంపీ కేశినేని నాని ఓ పోస్ట్ పెట్టారు.

Read Also: VBIT: విబీఐటి కళాశాలలో వార్డెన్ వికృత చేష్టలు.. విద్యార్థినుల అసభ్యకర ఫొటోలు తీసి..

ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా మాజీ ఎంపీ కేశినేని నాని రాసుకొచ్చారు.. 10 సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యుడిగా పని చేశాను.. జవాబుదారీతనం, పారదర్శకత, సమగ్రతతో పని చేశా.. నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటాను.. ఇది కేవలం లీగల్ నోటీసు మాత్రమే కాదు బెదిరించడం కూడా అని ఆరోపించారు. కానీ నేను మౌనంగా ఉండను.. అక్రమాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు ఆశిస్తే బెదిరింపులకు దిగుతారని మండిపడ్డారు. నేను దేని కోసం నిలబడ్డానో నాకు తెలుసు.. నేను ఇప్పుడు దేనికి వ్యతిరేకంగా నిలబడి ఉన్నానో కూడా నాకు తెలుసు అన్నారు. వాస్తవాలపై స్పందిస్తాను.. భయంతో కాదు అన్నారు. మౌనంగా కాదు, బహిరంగంగా స్పందిస్తాను తప్ప రాజీ పడను అని తేల్చి చెప్పారు. సత్యం బెదిరింపులకు లొంగదు నేను కూడా లొంగను అని కేశినేని నాని రాసుకొచ్చారు.

Exit mobile version