Kanaka Durga Temple: విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. విజయదశమి కావడంతో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజామునుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. దసరా శరన్నవరాత్రులు చివరి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మరోవైపు భవానీలు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఈసారి భవానీలు ముందుగానే ఇంద్రకీలాద్రికి చేరుకుంటుండటంతో కొండ దిగువ నుంచే భక్తులి కిటకిటలాడుతున్నారు.. క్యూలైన్లు మొత్తం జై దుర్గ.. జై జై దుర్గ నామ స్మరణలతో మారు మ్రోగుతున్నాయి.. భక్తులు, భవానీల రద్దీ కొనసాగుతోన్న నేపథ్యంలో.. మజ్జిగ, మంచినీళ్లు, పాలు క్యూలైన్లలో యథావిథిగా పంపిణీ చేస్తున్నారు అధికారులు.. ఇక, రాత్రి 11 గంటల వరకూ అమ్మవారి దర్శనం కల్పించనున్నారు..
Read Also: Heavy Rains: తుఫాన్‌పై వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీతోపాటు తెలంగాణకు భారీ వర్షాలు
మరోవైపు, కనకదుర్గమ్మను రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శనం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత.. హోంమంత్రికి కనకదుర్గమ్మ దర్శనం కల్పించారు ఆలయ అధికారులు, అర్చకులు.. దర్శనతరం హోంమంత్రికి వేదాశీర్వచనం చేసి ప్రసాదం, శేషవస్త్రం అందించారు వేదపండితులు.. ఇక, ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ అధికంగా ఉంది.. భవానీలు అధికంగా రావడంతో మరింతగా రద్దీ పెరిగింది.. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులతో ఆలయం లోపల సైతం భక్తులతో రద్దీగా మారిపోయింది.. అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందని, రాజరాజేశ్వరీ దేవి అవతారంలో దర్శించుకోవడం సంతోషం గా ఉందని అంటున్నారు భక్తులు.. క్యూలైన్ల లో నాలుగైదు గంటల సమయం పడుతున్నా సౌకర్యాలు బాగున్నాయని చెబుతున్నారు.